Share News

ఒక ఉగ్రవాద దేశం నన్నే ప్రశ్నిస్తోందా.. పాక్ జర్నలిస్ట్‌కు జైశంకర్ ఘాటు రిప్లై..

ABN , Publish Date - Sep 26 , 2026 | 07:52 AM

భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ పాకిస్థాన్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యకు విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జైశంకర్ పాల్గొన్నారు.

ఒక ఉగ్రవాద దేశం నన్నే ప్రశ్నిస్తోందా.. పాక్ జర్నలిస్ట్‌కు జైశంకర్ ఘాటు రిప్లై..
S Jaishankar, Pakistani journalist

ఇంటర్నెట్ డెస్క్: భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ పాకిస్థాన్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యకు విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జైశంకర్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ పాక్ జర్నలిస్టు ఆరోపించారు. దానికి జైశంకర్ స్పందిస్తూ.. 'ఒక టెర్రరిస్ట్ కంట్రీ నన్ను ఆ ప్రశ్న అడుగుతోందా?' అంటూ బదులిచ్చారు (S Jaishankar UN).


లైబీరియా విదేశాంగ మంత్రి సారా బెయిసోలో న్యాంటీతో కలిసి జైశంకర్ న్యూయార్క్‌లో మీడియాతో మాట్లాడారు. వాణిజ్య నౌకలు, నావికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంబంధించిన మీడియా సమావేశం ఇది. ఇద్దరు మంత్రులు తమ ప్రసంగాలు ముగించిన తర్వాత జైశంకర్‌ను పాకిస్థాన్‌కు చెందిన జర్నలిస్టు ప్రశ్నించారు. 'పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని మీ ప్రభుత్వం ఎప్పుడు ఆపుతుంది?' అని అడిగారు. దీనికి జైశంకర్ స్పందిస్తూ.. 'ఓ టెర్రరిస్ట్ కంట్రీ నన్ను ఆ ప్రశ్న అడుగుతోందా? కమాన్' అని స్పందించారు (Jaishankar Pakistan).


జైశంకర్‌ను పాకిస్థాన్ జర్నలిస్టు ప్రశ్నించిన ఘటనకు ఒక రోజు ముందు.. ఇదే తరహాలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ను భారత జర్నలిస్టు ప్రశ్నించారు (India Pakistan). ఐక్యరాజ్యసమితి భవనంలోకి షెహబాజ్ షరీఫ్ వెళ్తున్న సమయంలో 'ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు?' అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు షెహబాజ్ స్పందించకుండా వెళ్లిపోయారు.


ఈ వార్తలూ చదవండి

ఇదెక్కడి విడ్డూరం.. ఏఐ మోడల్స్‌కు ఏఐతోనే శిక్షణ

ఫోన్‌ టెంపర్డ్‌ గ్లాస్‌పై కొత్త రూల్‌.. ధరలు పెరుగుతాయా?

Updated Date - Sep 26 , 2026 | 07:55 AM