Share News

హోర్ముజ్ కాదు.. ట్రంప్ జలసంధి.. పేరు మారుస్తూ అమెరికా అధ్యక్షుడి పోస్ట్..

ABN , Publish Date - Sep 26 , 2026 | 10:10 AM

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన మ్యాప్‌ను షేర్ చేశారు. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధి పేరును మార్చి దానికి 'ట్రంప్ జలసంధి' అని పేరు పెట్టారు.

హోర్ముజ్ కాదు.. ట్రంప్ జలసంధి.. పేరు మారుస్తూ అమెరికా అధ్యక్షుడి పోస్ట్..
Trump Strait

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన మ్యాప్‌ను షేర్ చేశారు. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధి పేరును మార్చి దానికి 'ట్రంప్ జలసంధి' అని పేరు పెట్టారు. ఆ మ్యాప్‌ను తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు (Strait of Hormuz).


హోర్ముజ్ జలసంధిని అమెరికా నియంత్రణలోకి తీసుకున్నట్లు పేర్కొంటూ, దాని పేరును 'ట్రంప్ స్ట్రెయిట్'గా మార్చాలా అని ప్రశ్నించారు. ట్రంప్ వ్యాఖ్యల అనంతరం అమెరికా అధ్యక్ష భవనం కూడా సోషల్ మీడియాలో 'ట్రంప్ స్ట్రెయిట్' అని పేరు పెట్టిన మ్యాప్‌ను పంచుకుంది. ఈ పేరుకు మంచి సౌండింగ్ ఉందంటూ వ్యాఖ్యానించింది. గతంలో కూడా హోర్ముజ్ జలసంధిపై అమెరికా నియంత్రణ గురించి ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టులో ఈ ప్రాంతాన్ని 'న్యూ యూఎస్ టెరిటరీ'గా చూపించే మ్యాప్‌ను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Trump Strait).


ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య హోర్ముజ్ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి (US Iran War). ఇలాంటి తరుణంలో ట్రంప్ ఇలాంటి మ్యాప్‌ను షేర్ చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తోంది. ప్రపంచ ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధిపై నియంత్రణ కోసం ఇరాన్, అమెరికా పోటీ పడుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

ఒక ఉగ్రవాద దేశం నన్నే ప్రశ్నిస్తోందా.. పాక్ జర్నలిస్ట్‌కు జైశంకర్ ఘాటు రిప్లై..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 26 , 2026 | 10:47 AM