Share News

'సర్' వివాదంపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలి: బీజేపీ మిత్రపక్షాలు

ABN , Publish Date - Sep 26 , 2026 | 09:05 AM

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో అధికార కూటమిలోని మూడు మిత్రపక్షాలు స్పందించాయి. 'సర్' వివాదంపై ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన వివరణ కోరాయి.

'సర్' వివాదంపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలి: బీజేపీ మిత్రపక్షాలు
ECI SIR row

ఇంటర్నెట్ డెస్క్: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (SIR)పై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో అధికార కూటమిలోని మూడు మిత్రపక్షాలు స్పందించాయి. 'సర్' వివాదంపై ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన వివరణ కోరాయి. ఈ అంశంపై ఎన్నికల సంఘం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా అధినేత ఉపేంద్ర కుష్వాహా, తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు (ECI SIR row).


ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాల్సింది ప్రతిపక్షాలను సంతృప్తి పరిచేందుకు కాదని, ప్రజల్లో ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని కొనసాగించేందుకేనని ఈ నేతలు పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణపై వివిధ వర్గాల నుంచి ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వడం అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు అనుమానాలు కలిగే పరిస్థితి ఏర్పడటం సరికాదని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ అన్నారు (Special Intensive Revision NDA allies).


ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై లేవనెత్తిన అనుమానాలను ప్రతిపక్షాలు నిరూపించలేకపోయాయని తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు (TDP Lavu Sri Krishna Devarayalu). ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థగా ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక బాధ్యతను నిర్వహిస్తోందని, ప్రస్తుతం లేవనెత్తుతున్న ప్రశ్నలపై ఎన్నికల సంఘం వివరణ ఇస్తే ప్రజల్లో విశ్వాసం మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక, ఓటర్ల జాబితాల సవరణ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో గందరగోళం నెలకొందని, దానిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు ఉపేంద్ర కుష్వాహా అన్నారు.


ఇవి కూడా చదవండి..

ఒక ఉగ్రవాద దేశం నన్నే ప్రశ్నిస్తోందా.. పాక్ జర్నలిస్ట్‌కు జైశంకర్ ఘాటు రిప్లై..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 26 , 2026 | 09:05 AM