తుది దశకు ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయం
ABN , Publish Date - Sep 26 , 2026 | 02:41 AM
ప్రభుత్వ రంగంలోని ఐడీబీఐ బ్యాంక్ ఈక్విటీలో 60.72 శాతం వాటా విక్రయ ప్రక్రియ తుది దశకు చేరింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఐడీబీఐ బ్యాంక్ ఈక్విటీలో 60.72 శాతం వాటా విక్రయ ప్రక్రియ తుది దశకు చేరింది. ఈ వాటా కొనుగోలు కోసం ప్రేమ్‌వత్స నాయకత్వంలోని ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్స్, దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఎమిరేట్స్ ఎన్‌డీబీ సమర్పించిన ఆర్థిక బిడ్లను ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఈ రెండు సంస్థలు ఐడీబీఐ బ్యాంక్ ఈక్విటీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చాయి. ఈ రెండు సంస్థలు ఐడీబీఐ బ్యాంక్ ఈక్విటీలో మెజారిటీ వాటా కొనుగోలు కోసం బిడ్స్ సమర్పించడం ఇది రెండోసారి. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్ ఈక్విటీలో కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీకి 94.71 శాతం వాటా ఉంది.