Share News

టీజీ టీ20 లీగ్.. విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసులు

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:40 PM

టీజీ టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ లీగ్‌కు బీసీసీఐ అనుమతులు లేవని పేర్కొంటూ అతడికి టీసీఏ లీగల్ నోటీసులు జారీ చేసింది.

టీజీ టీ20 లీగ్.. విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసులు
Vijay Deverakonda

హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ టీ20(TG20) లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ లీగ్‌కు సంబంధించి బీసీసీఐ అనుమతులు లేవని పేర్కొంటూ అతడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. హెచ్‌సీఏ (HCA) నిర్వహిస్తున్న టీజీ టీ20 టోర్నమెంట్‌కు బీసీసీఐ నుంచి అధికారిక అనుమతి లేదని, అయినప్పటికీ లీగ్ కొనసాగిస్తున్నారని తెలిపారు.


ఇతర ప్రముఖులకూ..

TG20 లీగ్‌లో పాల్గొంటున్న లేదా ప్రమోట్ చేస్తున్న మరో ఎనిమిది మంది సెలబ్రిటీలకు కూడా నోటీసులు జారీ చేస్తామని గురువారెడ్డి వెల్లడించారు. ఇందులో భారత క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్ సహా మరికొందరు ఉన్నారని తెలిపారు.


బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు..

ఈ లీగ్ నిర్వహణలో బీసీసీఐ రూల్ నంబర్ 31ని ఉల్లంఘించినట్లు గురువారెడ్డి తెలిపారు. అధికారిక అనుమతి లేకుండా టోర్నమెంట్ నిర్వహించడం క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగానే లీగ్‌కు సంబంధించిన వ్యక్తులపై చర్యలకు ఉపక్రమించినట్టు తెలిపారు.


రాజకీయ, ఆర్థిక కోణాలపై ఆరోపణలు..

ఈ టోర్నమెంట్ క్రీడా కార్యక్రమం మాత్రమే కాదని, దీని వెనుక సుమారు రూ.100 కోట్ల రాజకీయ, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ఉన్నాయని గురువారెడ్డి ఆరోపించారు. ఈ అంశంపైనా సమగ్ర విచారణ అవసరమని డిమాండ్ చేశారు.


లీగ్‌కు అనుమతులు ఉన్నాయా.?

TG20 లీగ్ చుట్టూ నెలకొన్న వివాదం కారణంగా క్రికెట్ వర్గాలు, సినీ రంగంలో చర్చలు ప్రారంభమయ్యాయి. లీగ్‌కు అనుమతులు ఉన్నాయా? లేదా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. నోటీసులు అందుకున్న సెలబ్రిటీల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

బోనస్ ఇచ్చే 7 రకాల సన్న వడ్లు అందుబాటులో ఉంచాలి: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 06:51 PM