రైళ్లలో సీటు కోసం ఇక నో టెన్షన్.. ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా..
ABN , Publish Date - Mar 01 , 2026 | 01:57 PM
ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీట్ల కోసం నానా తిప్పలు పడాల్సి వస్తుంటుంది. అయితే ఓ వ్యక్తి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నాడు. దీనికోసం..
రైలు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది సీట్ల కోసం జరిగే తోపులాట, గొడవలు. ఎలాగైనా సీటు సంపాదించాలనే కోరికతో చాలా మంది శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. ఇక ఢిల్లీ, ముంబై వంటి మహా నగరాల్లో అయితే సీట్ల కోసం ఏకంగా యుద్ధాలే జరుగుతుంటాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఈ సీట్ల సమస్యను పరిష్కరించేందుకు ఓ యువకుడు వినూత్న ప్రయోగం చేశాడు. ఇతడు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘సీటు కోసం ఇక నో టెన్షన్’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీ మెట్రోలో (Delhi Metro) ప్రయాణికుల రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీట్ల కోసం నానా తిప్పలు పడాల్సి వస్తుంటుంది. అయితే ఓ వ్యక్తి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నాడు. దీనికోసం అతను ఏకంగా ఓక సీటునే తయారు చేశాడు. అది కూడా ఎంచక్కా దాన్ని బ్యాగులో వేసుకుని వెళ్లేలా సెట్ తయారు చేశాడు. చూసేందుకు గుండ్రటి ప్లాస్టిక్ చక్రంలా కనిపించే దీన్ని.. మధ్యలో పట్టుకుని లాగితే పొడవుగా సీటులా మారిపోతుంది.
రైలు దిగేటప్పుడు ఈ సీటును మడిచేసి, బ్యాగులో పెట్టుకోవచ్చన్నమాట. ఇలా ఈ వ్యక్తి విచిత్రమైన సీటును తయారు చేశాడు. రైల్లో ఇతడి వింత స్టూల్‌ను చూసి అంతా తెగ నవ్వుకున్నారు. కొందరు దానిపై కూర్చుని, ఎలా ఉందో కూడా చెక్ చేశారు. మొత్తానికి సీట్ల కోసం ఇబ్బంది పడకుండా ఇతను చేసిన వింత ప్రయోగం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ వ్యక్తి ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘దీన్ని బ్యాగులో వేసుకుంటే.. సీటు సమస్యే ఉండదుగా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 103.2 లక్షలకు పైగా లైక్‌లు, 2.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..
కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..