Share News

ఈ పిల్లి చేష్టలు మామూలుగా.. యజమానిని ఎలా ఆటపట్టిస్తుందో చూస్తే..

ABN , Publish Date - Mar 01 , 2026 | 09:58 AM

జపాన్‌‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో దుస్తులను ఇస్త్రీ చేసుకుంటున్నాడు. అదే సమయంలో తన పిల్లి అక్కడికి వచ్చింది. తన యజమానిని ఆట పట్టించాలనుకుందో ఏమో గానీ.. మెల్లిగా దగ్గరికి వెళ్లి..

ఈ పిల్లి చేష్టలు మామూలుగా.. యజమానిని ఎలా ఆటపట్టిస్తుందో చూస్తే..

పిల్లుల ప్రవర్తన కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటుంది. అప్పుడప్పుడూ మనుషులను అనుకరిస్తూ అవి చేసే పనులు.. అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన దుస్తులు ఇస్త్రీ చేస్తుండగా.. పిల్లి అక్కడికి వచ్చింది. చివరకు అది చేసిన పని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఈ పిల్లి చేష్టలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జపాన్‌‌కు (Japan) చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో దుస్తులను (Man ironing pant) ఇస్త్రీ చేసుకుంటున్నాడు. అదే సమయంలో తన పిల్లి అక్కడికి వచ్చింది. తన యజమానిని ఆట పట్టించాలనుకుందో ఏమో గానీ.. మెల్లిగా దగ్గరికి వెళ్లి, ఐరన్ చేసిన ప్రాంతంలో ప్యాంట్‌పై పడుకుని పాడు చేసింది.


పిల్లి (cat) ప్రవర్తన చూసి నవ్వుకున్న ఆ వ్యక్తి మరో వైపు ఐరన్ చేశాడు. అది చూసిన పిల్లి.. అటు వైపు కూడా వెళ్లి ప్యాంట్‌ను పాడు చేసింది. ఇలా ఎన్నిసార్లు ఐరన్ చేసినా కూడా.. ఆ పిల్లి పదే పదే ఆ ప్యాంట్‌ను పాడు చేస్తూనే ఉంది. పిల్లి చేసిన పనికి ఆ యజమానికి ఏమాత్రం కోపం రాకపోగా.. అది చేసిన పని చూసి మురిసిపోయాడు. ఇలాంటి సన్నివేశాలు పిల్లి యజమానులకు సాధారణమే అయినా.. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


ఈ వీడియో చూసిన చాలామంది యూజర్లు తమ అనుభవాలను షేర్ చేస్తున్నారు. ‘పిల్లి జుట్టు ఎప్పుడూ నా యాక్సెసరీ లాగా ఉంటుంది’.. అంటూ కొందరు, ‘ఈ పిల్లి చేష్టలు మామూలుగా లేవుగా’.. అంటూ మరికొందరు ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 27న అప్‌లోడ్ అయిన ఈ వీడియో ఇప్పటికే 3400కి పైగా లైక్‌లు, 260కి పైగా రీపోస్ట్‌లు, 90వేలకు పైగా వ్యూస్‌ను సాధించింది.


ఇవి కూడా చదవండి..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2026 | 09:58 AM