Share News

ఈ కోతి ముందు స్పైడర్ మ్యాన్‌ కూడా దిగదుడుపే.. ఏం చేసిందో మీరే చూడండి..

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:30 AM

ఒక కోతి చేసిన సాహస విన్యాసానికి సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కోతి చాలా ఎత్తుగా ఉన్న గోడ వద్దకు వచ్చింది. సాధారణంగా ఆ గోడను ఎక్కడం అసాధ్యం. అయితే..

ఈ కోతి ముందు స్పైడర్ మ్యాన్‌ కూడా దిగదుడుపే.. ఏం చేసిందో మీరే చూడండి..

కోతి చేష్టలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా సార్లు ఆ పనులు చిరాకు పుట్టించినా.. అప్పుడప్పుడూ అందరినీ ఆలోచింపజేస్తాయి. కొన్నిసార్లు ఆ కోతి చేష్టలు అందరికీ కనువిప్పు కూడా కలిగిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కోతి గోడ ఎక్కేందుకు చేసిన స్టంట్స్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఈ కోతి స్పైడర్ మ్యాన్‌ను మించిపోయిందిగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


ఒక కోతి చేసిన సాహస విన్యాసానికి సంబంధించిన పాత వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కోతి చాలా ఎత్తుగా ఉన్న గోడ వద్దకు వచ్చింది. సాధారణంగా ఆ గోడను ఎక్కడం అసాధ్యం. అయితే ఎలాగైనా ఆ గోడను ఎక్కేయాలని కోతి ఫిక్స్ అయింది. మొదటగా బలంగా ఓ జంప్ చేసింది. అయితే తీరా నాలుగు, ఐదు అడుగుల ఎత్తు మేర ఎగిరి కిందపడుతుంది. ఆ తర్వాత ఇంకాస్త వెనక్కు వెళ్లి.. మళ్లీ ఒక్క జంప్ చేసి గోడ మధ్యలో ఉన్న రంధ్రంలో చేయి పెట్టి వేలాడుతుంది.


ఆ తర్వాత కొంచెం కొంచెం పక్కకు జరుగుతూ వచ్చి.. చివరగా అనుకున్నట్లుగానే ఆ గోడను పూర్తిగా పైకి ఎక్కేసింది. ఇలా కోతి అనుకున్న విధంగా అంత పెద్ద గోడను (monkey climbed up the high wall) సైతం ఎంతో అవలీలగా ఎక్కేసిందన్నమాట. ఆ తర్వాత దానికి అది చాలా సింపుల్ అయిపోయింది. స్పైడర్ మ్యాన్ తరహాలో మళ్లీ పైనుంచి కిందకు దూకి, మళ్లీ పైకి ఎక్కడం ఇలా స్టంట్స్ చేస్తూనే ఉందన్నమాట. చూసేందుకు ఇది సింపుల్‌గా అనిపిస్తున్నా కూడా.. చాలా మందికి ఇది ఇన్‌స్పైర్ కలిగించేలా ఉంది.


పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కాని పని అంటూ ఏదీ ఉండదు అనేదానికి ఈ కోతి ఒక నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ కోతి చేష్టలు ఆలోచింపజేసేలా ఉన్నాయి’.. అంటూ కొందరు, ‘ఈ కోతిని ఆదర్శంగా తీసుకుని.. జీవితంలో అనుకున్నది సాధించాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 26 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2026 | 11:34 AM