Share News

రన్నింగ్ రైల్లో, రెండు బోగీల మధ్యలో.. ఇతనేం చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:39 PM

ఓ రైల్వే స్టేషన్‌‌లో ప్రయాణికులు రైలు కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో ఓ రైలు వచ్చి ఆగింది. కాసేపటి తర్వాత యథావిధిగా రైలు మెల్లిగా బయలుదేరింది. అయితే రైలు బోగీల మధ్యలో కనిపించిన సీన్.. అక్కడున్న వారంతా షాక్ అయ్యేలా చేసింది..

రన్నింగ్ రైల్లో, రెండు బోగీల మధ్యలో.. ఇతనేం చేస్తున్నాడో చూడండి..

ప్రస్తుతం చాలా మంది.. రైలు ప్రయాణాలను తమ రీల్స్‌కు అనుకూలంగా మార్చుకుంటుంటే.. కొందరు రైళ్లలో చిత్రవిచిత్రమైన పనులు చేస్తు్న్నారు. ఇంకొందరైతే ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రయాణాలు చేస్తుంటారు. ఎంత అవగాహన కల్పించినా ఇలాంటి వారిలో మార్పు రావడం లేదు. ఇలాంటి ప్రయాణాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు రన్నింగ్ రైల్లో, రెండు బోగీల మధ్యలో ప్రయాణించిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఏంట్రా ఇదీ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైల్వే స్టేషన్‌‌లో ప్రయాణికులు రైలు కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో ఓ రైలు వచ్చి ఆగింది. కాసేపటి తర్వాత యథావిధిగా రైలు మెల్లిగా బయలుదేరింది. అయితే రైలు బోగీల మధ్యలో కనిపించిన సీన్.. అక్కడున్న వారంతా షాక్ అయ్యేలా చేసింది. సీటు దొరక్క అలా చేశాడో.. లేక వీడియోల కోసం చేశాడో తెలీదు గానీ.. (man standing between two carriages in running train) ఓ వ్యక్తి ఏకంగా రెండు బోగీల మధ్యలో నిలబడ్డాడు.


బోగీల మధ్యలో నిలబడడమే కాకుండా తాపీగా చేతిలో ఖైనీ వేసుకుని నలిపేస్తున్నాడు. ఆ సమయంలో అతడి ముఖంలో కొంచెం కూడా భయం కనిపించలేదు. ఎంతో కూల్‌గా (man chewing Khaini between two carriages) ఖైనీ వేసుకుంటున్నాడు. ఏమాత్రం అదుపు తప్పినా వెంటనే రైలు నుంచి కిందపడే ప్రమాదం ఉంటుంది. స్టేషన్‌లో ఉన్న వారు ఈ ఘటనను వీడియో తీశారు. తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ.. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇతను మా బీహారీ వాడే అయ్యుంటాడు’.. అంటూ కొందరు, ‘ఇలా చేయడం చాలా ప్రమాదం.. ఎవరూ ఇలా చేయొద్దు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త రాస్తున్న సమయానికి.. ఈ వీడియో 84కు పైగా లైక్‌లు, 7 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

హెల్మెట్‌ను ఇలాక్కూడా వాడొచ్చు.. ఇతడి తెలివి చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2026 | 12:41 PM