Share News

హెల్మెట్‌ను ఇలాక్కూడా వాడొచ్చు.. ఇతడి తెలివి చూస్తే..

ABN , Publish Date - Apr 09 , 2026 | 08:54 AM

బైక్‌లో వెళ్లిన ఓ వ్యక్తి హెల్మెట్‌ను తన వెంట తీసుకెళ్లాడు. ఇందులో విచిత్రమేమీ లేకున్నా.. హెల్మెట్‌ను అతను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. హెల్మెట్‌ను అంతా తలకు పెట్టుకుంటే.. ఇతను మాత్రం..

హెల్మెట్‌ను ఇలాక్కూడా వాడొచ్చు.. ఇతడి తెలివి చూస్తే..

సోషల్ మీడియా ప్రపంచంలోకి ఒక్కసారి వెళ్తే తిరిగి వెనక్కు రావడం చాలా కష్టం. స్క్రోల్ చేసే కొద్దీ.. వింతలు, విచిత్రాలకు సంబంధించిన వీడియోలు కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే అంతా ఆశ్చర్యపోయేలా ఉంటే.. మరికొన్ని వీడియోలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి హెల్మెట్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బైక్‌లో వెళ్లిన ఓ వ్యక్తి హెల్మెట్‌ను (Helmet) తన వెంట తీసుకెళ్లాడు. ఇందులో విచిత్రమేమీ లేకున్నా.. హెల్మెట్‌ను అతను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. హెల్మెట్‌ను అంతా తలకు పెట్టుకుంటే.. ఇతను మాత్రం దాన్ని వినూత్నంగా వినియోగించాడు. చంటి పిల్లాడితో బైకులో వెళ్లిన అతను.. మధ్యలో రద్దీగా ఉన్న జనాల మధ్య నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఈ సమయంలో పిల్లాడు ఇబ్బంది పడకుండా అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కయ్యారు.


ఇలాంటి సమయాల్లో సాధారణంగా ఎవరైనా పిల్లలను భుజంపై ఎత్తుకుని వెళ్తుంటారు. కానీ ఇతను మాత్రం మరింత భద్రంగా ఉండేందుకు.. ఆ పిల్లాడిని ఏకంగా హెల్మెట్‌లో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టడమే కాదు.. పిల్లాడు ముందుకు పడిపోకుండా దానికి ఉన్న బెల్ట్‌ను నడుముకు కట్టాడు. చూసేందుకు ఇది కారులో సీటు బెల్ట్‌ పెట్టుకున్న చందంగా ఉంది. ఇలా ఆ పిల్లాడిని హెల్మెట్‌లో కూర్చోబెట్టి, (man carrying child in helmet ) ఎంతో భద్రంగా తీసుకెళ్లాడు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పిల్లాడికి ఇది చాలా బెస్ట్ వ్యూ’.. అంటూ కొందరు, ‘పిల్లలను ఇలాక్కూడా తీసుకెళ్లవచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త రాస్తున్న సమయానికి ఈ వీడియో 390కి పైగా లైక్‌లు, 6వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

దారి మధ్యలో మహిళ.. వెనుకే నిలబడ్డ రోబో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2026 | 09:06 AM