సీరియస్‌గా చోరీకి వెళ్లారు.. చిన్న తప్పుతో చివరకు..
ABN , Publish Date - Mar 17 , 2026 | 01:18 PM
ముగ్గురు దొంగలు రాత్రి వేళ చోరీ చేసేందుకు వెళ్లారు. పల్లెటూరిలో ఓ ఇంటిని టార్గెట్ చేసిన వారు.. మెల్లిగా అక్కడికి చేరుకున్నారు. సీసీ కెమెరాకు చిక్కకుండా ముఖాలకు మాస్క్‌లు కూడా వేసుకున్నారు. అయితే..
ప్రస్తుతం దొంగలు ఎంత తెలివి మీరిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు కాలు కదపకుండా ఇంట్లో కూర్చునే ఎంతో తెలివిగా సైబర్ నేరాలకు పాల్పడుతుంటే.. మరికొందరు రాత్రి వేళల్లో ఇళ్లల్లోకి చొరబడి మరీ చోరీలు చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో దొంగలకు కొన్నిసార్లు షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు తెలిసి చిక్కుల్లో పడితే.. మరికొన్నిసార్లు తెలీక దొరికిపోతుంటారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు దొంగలు రాత్రి వేళ చోరీకి వెళ్లారు. అయితే లైట్లు ఆర్పేందుకు స్విచ్ నొక్కడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..
ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముగ్గురు దొంగలు రాత్రి వేళ చోరీ చేసేందుకు వెళ్లారు. పల్లెటూరిలో ఓ ఇంటిని టార్గెట్ చేసిన వారు.. మెల్లిగా అక్కడికి చేరుకున్నారు. సీసీ కెమెరాకు చిక్కకుండా ముఖాలకు మాస్క్‌లు కూడా వేసుకున్నారు. ఇలా అన్ని జాగ్రత్తలూ తీసుకుని, అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ముందుగా ఓ వ్యక్తి వెళ్లగా.. ఆ వెనుకే మరో ఇద్దరూ వెళ్తున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది.
ఆ ఇంటి బయట అప్పటికే బల్బ్ వెలుగుతోంది. దీంతో మధ్యలో ఉన్న దొంగ.. ఆ బల్బ్‌ను ఆర్పేందుకు స్విచ్ నొక్కాడు. అయితే బల్బ్‌కు సంబంధించిన (thief pressed the doorbell switch) స్విచ్ కాకుండా డోర్‌బెల్ స్విచ్ నొక్కాడు. దీంతో ఆ ఇంట్లో ఒక్కసారిగా బెల్ మోగింది. బెల్ శబ్ధం వినిపించగానే ముందు వెళ్తున్న దొంగ.. చచ్చాంరో దేవుడా.. అనుకుంటూ వెనక్కు పారిపోయాడు. తర్వాత అంతా కలిసి అక్కడి నుంచి ఉడాయించారు. ఇలా ఆ దొంగలు ఏదో చేయబోతే.. చివరకు ఇంకేదో అయిందన్నమాట.
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పొద్దున లేచి ఎవరి ముఖం చూశారో ఏమో’.. అంటూ కొందరు, ‘ఇంకా ట్రైనింగ్ దశలోనే ఉన్నట్టున్నారు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
గ్యాస్ లేదని ఎలక్ట్రిక్ స్టవ్ కొన్నాడు.. తీరా కూర ఉడికే ముందు చూసి ఖంగుతిన్నాడు..
వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌ను ఎలా మార్చారో చూడండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..