Share News

ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Apr 09 , 2026 | 07:35 AM

ప్రయాణికులతో ఉన్న ఓ రైలు.. స్టేషన్‌లో ఆగింది. లోకల్ రైలు కావడంతో జనాలు రద్దీగా ఉన్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది..

ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

రైలు అంటేనే రద్దీ జనాలు, సీట్ల కోసం తోపులాటలు, వింత వింత విన్యాసాలు.. ఇవే గుర్తుకొస్తాయి. మరికొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రయాణం చేసే దృశ్యాలూ కనిపిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న రైలు వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. రైల్లో ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బిహార్‌లో (Bihar) చోటు చేసుకుంది. ప్రయాణికులతో ఉన్న ఓ రైలు.. కతిహార్ జిల్లా మనిహారి రైల్వేస్టేషన్‌లో ఆగింది. లోకల్ రైలు కావడంతో జనాలు రద్దీగా ఉన్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. దోబీ ఘాట్‌లో కనిపించే దృశ్యాలు.. ఊహించని విధంగా రైల్లో కనిపించడంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.


మహిళలకు సంబంధించిన దుస్తులను (women drying clothes in train) బోగీలో ఆరబెట్టారు. బోగీ మధ్యలో అక్కడక్కడా దుస్తులను ఆరేయడం చూసి అంతా విస్తుపోయారు. కొందరు.. ఇదంతా కామనే అన్నట్లుగా పట్టించుకోకుండా ఎవరి పనిలో వారు మునిగిపోయారు. ఈ దృశ్యం చూసి విస్తుపోయిన ఓ వ్యక్తి.. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘రైలును దోబీ ఘాట్ చేసేశారుగా’.. అంటూ కొందరు, ‘రైల్లో ఇలాంటి దృశ్యాలను ఇప్పుడే చూస్తున్నాం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 37 వేలకు పైగా లైక్‌లు, 2.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

సీరియస్‌గా చోరీకి వెళ్లారు.. చిన్న తప్పుతో చివరకు..

దారి మధ్యలో మహిళ.. వెనుకే నిలబడ్డ రోబో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2026 | 07:43 AM