Share News

నదిలో స్నానం చేస్తున్న యువతి.. సడన్‌గా చేతికి తగిలిన మొసలి.. చివరకు..

ABN , Publish Date - Apr 09 , 2026 | 10:38 AM

ఓ యువతి నదిలో ప్రశాంతంగా స్నానం చేస్తోంది. నదీ స్నానాన్ని ఆమె ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటుంది. ఇలా ప్రశాంతంగా స్నానం చేస్తుండగా.. సడన్‌గా ప్రాణాలు పోయేంత పనైంది. స్నానం చేస్తున్న సమయంలో కాళ్ల వద్ద..

నదిలో స్నానం చేస్తున్న యువతి.. సడన్‌గా చేతికి తగిలిన మొసలి.. చివరకు..

సోషల్ మీడియా ప్రస్తుతం వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. సినిమాల్లో కనిపించే చిత్ర విచిత్రాలన్నీ నిజ జీవితంలో దర్శనమిస్తుంటాయి. అవన్నీ క్షణాల వ్యవధిలో వీడియోలుగా మారి నెట్టింట సందడి చేస్తుంటాయి. వీటిలో యువతులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి నదిలో స్నానం చేస్తుండగా.. సడన్‌గా ఓ మొసలి నీటి లోపలి నుంచి పైకి వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి నదిలో ప్రశాంతంగా స్నానం చేస్తోంది. నదీ స్నానాన్ని ఆమె ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటుంది. ఇలా ప్రశాంతంగా స్నానం చేస్తుండగా.. సడన్‌గా ప్రాణాలు పోయేంత పనైంది. స్నానం చేస్తున్న సమయంలో కాళ్ల వద్ద ఏదో తగిలినట్లు అనిపించడంతో.. అదేదో చేప అనుకుని చేతులతో పట్టుకోబోయింది. తీరా చేతులతో దాన్ని బయటికి తీయాలని చూడగా.. మొసలి పైకొచ్చింది.


మొసలిని చూడగానే ఆమె ఒక్కసారిగా భయంతో గట్టిగా కేకలు వేసింది. చచ్చాన్రో దేవుడో.. అనుకుంటూ, వేగంగా ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకుంది. అంతవరకూ హాయిగా కనిపించిన ఆమె.. మొసలిని చూసినప్పటి నుంచి వణికిపోయింది. అయితే అది పిల్ల మొసలి కావడంతో ఆమెకు ఎలాంటి హానీ చేయలేదు. ఎట్టకేలకు ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో.. హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఇదంతా వ్యూస్‌ కోసం చేశారో.. లేక నిజంగా జరిగిందో తెలీదు గానీ.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మొసలిని చూసి ఆమె భయపడితే.. ఆమెను చూసి మొసలి భయపడింది’.. అంటూ కొందరు, ‘చూస్తుంటే ఇది ఏఐ వీడియోలాగా ఉంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త రాస్తున్న సమయానికి వీడియో 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

హెల్మెట్‌ను ఇలాక్కూడా వాడొచ్చు.. ఇతడి తెలివి చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2026 | 10:50 AM