ఇరాన్లో కిలో బియ్యం ఎంతంటే.. సమాధానం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
ABN , Publish Date - Apr 09 , 2026 | 01:09 PM
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంతో ప్రధానంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్లో అయితే పరిస్థితి దారుణంగా తయారవుతోంది. యుద్ధం ఎఫెక్ట్తో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ద్రవ్యోల్బణంతో పాటూ ఉపాధి అవకాశాలు కూడా తగ్గడంతో..
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇరాన్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఇక ద్రవ్యోల్బణం విషయానికొస్తే ఊహించని స్థాయికి చేరుకుంది. ఈ కారణంగా వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇరాన్లోని వస్తువుల ధరల గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.ఈ క్రమంలో ఇరాన్లోకిలో బియ్యం ధర అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంతో ప్రధానంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్లో అయితే పరిస్థితి దారుణంగా తయారవుతోంది. యుద్ధం ఎఫెక్ట్తో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ద్రవ్యోల్బణంతో పాటూ ఉపాధి అవకాశాలు కూడా తగ్గడంతో ప్రజల కొనుగోలు శక్తి కూడా క్షీణించింది. ఇరానియన్ రియాల్ (Iranian Rial) రోజురోజుకూ బలహీనపడుతుండటంతో.. మార్కెట్లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీనివల్ల అక్కడి ప్రజలు నిత్యావసరాలు కొనేందుకూ తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉప్పు, పప్పు మొదలుకొని కూరగాయల ధరల వరకూ అన్నీ పెరిగిపోయాయి.
ఇరాన్లో ద్రవ్యోల్బణం (Inflation in Iran) ఎఫెక్ట్ అక్కడి ఆహార పదార్థాలపై పడడంతో ధరల పెరుగుదలకు కారణమైంది. ఈ క్రమంలో ఇరాన్లో కిలో బియ్యం ధర (kilo rice Price in Iran) నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది. ఇరాన్లో ప్రస్తుతం కిలో బియ్యం ధర సుమారు 1,500,000 నుంచి 2,000,000 రియాల్స్కు (రూ.340 to రూ.455) చేరుకుంది. గతంలో (2024 to 2025) బియ్యం ధర రూ.53 నుంచి రూ.70లు ఉండేదని తెలుస్తోంది.

అలాగే కిలో పప్పుల ధర ప్రస్తుతం 25,00,000 నుంచి 35,00,000 రియాల్స్కు (రూ.550 - రూ.770) చేరుకుందని తెలుస్తోంది. గతంలో (2024 to 2025) వీటి ధర రూ.70 నుంచి రూ.105లు మధ్యలో ఉండేది. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు వీటిని కొనే పరిస్థితి లేక.. ఉన్న వాటితోనే సర్దుకునే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
హెల్మెట్ను ఇలాక్కూడా వాడొచ్చు.. ఇతడి తెలివి చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..