Share News

ఇల్లు పేకమేడలా కూలిందనుకుంటే పొరపడ్డట్లే.. నిశితంగా పరిశీలిస్తే పరేషాన్ అవుతారు..

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:32 AM

రోడ్డు పక్కనే ఉన్న ఓ పెద్ద ఇంటిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆ ఇల్లు పేక మేడలా కూలిపోయినట్లు కనిపిస్తుండడంతో.. భూకంపం వచ్చిందేమో అని అంతా అనుకున్నారు. కానీ దగ్గరగా వెళ్లి చూడగా..

ఇల్లు పేకమేడలా కూలిందనుకుంటే పొరపడ్డట్లే.. నిశితంగా పరిశీలిస్తే పరేషాన్ అవుతారు..

కళ్లతో చూసేవన్నీ కొన్నిసార్లు నిజాలు కాకపోవచ్చు. అప్పుడప్పుడూ కొన్ని దృశ్యాలు చూసినప్పుడు.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఇలాంటివి సర్వసాధారణమైపోయాయి. ఇక ఇళ్ల నిర్మాణాల విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ విషయంలో కొందరు వినూత్నంగా ఆలోచించడం చూస్తుంటాం. కొన్ని ఇళ్లను చూస్తే, అరే.. ఇదెలా సాధ్యం అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఇళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పడిపోయినట్లుగా ఉన్న ఓ ఇంటిని చూసి అంతా భూకంపం వచ్చిందేమో అనుకున్నారు. చివరకు నిశితంగా పరిశీలించి షాక్ అవుతున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ పెద్ద ఇంటిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆ ఇల్లు పేక మేడలా కూలిపోయినట్లు కనిపిస్తుండడంతో.. భూకంపం వచ్చిందేమో అని అంతా అనుకున్నారు. కానీ దగ్గరగా వెళ్లి చూసి షాక్ అవుతున్నారు. ఆ ఇంటిని కూలిపోయినట్లు కనిపించేలా డిజైన్ చేసి మరీ నిర్మించారు.


కింద ఉన్న రెండు గదులు.. క్రాస్‌గా కూలిపోయినట్లుగా ఉండగా.. పైన ఉన్న మరో గది.. ఏటవాలుగా పడిపోయినట్లుగా డిజైన్ చేశారు. దూరం నుంచి చూసే వారికి.. భూకంపం వచ్చి ఆ మేడ మొత్తం కూలిపోయినట్లు అనిపిస్తోంది. నిశితంగా పరిశీలిస్తేగానీ.. (house built to look like it's falling down) అసలు విషయం తెలీదన్నమాట. ఇలా వినూత్నంగా ఉన్న ఈ ఇల్లు.. దారిన వెళ్లే వారందరినీ ఆకట్టుకుంటోంది. అటుగా వెళ్లే వారంతా.. ఈ ఇంటిని ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ ఇంజినీర్‌.. ప్లానింగ్ గీసే సమయంలో గంజాయి తాగినట్లు ఉన్నాడు’.. అంటూ కొందరు, ‘ఆ ఇంట్లో ఎవరైనా బతికి ఉన్నారా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త రాస్తున్న సమయానికి ఈ వీడియో 12 వేలకు పైగా లైక్‌లు, 24 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

హెల్మెట్‌ను ఇలాక్కూడా వాడొచ్చు.. ఇతడి తెలివి చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2026 | 12:03 PM