సబ్బు తింటున్న కోతి.. మందలించిన మహిళ.. చివర్లో ట్విస్ట్ చూస్తే..
ABN , Publish Date - Apr 10 , 2026 | 09:21 AM
ఓ ఇంటి బయట ప్రహరీ గోడపై కోతి కూర్చుని ఉంది. కామ్‌గా కూర్చుని ఉండుంటే సమస్య లేదు గానీ.. ఆ కోతి ఇంటి బాత్‌రూమ్‌లోకి వెళ్లి మరీ సబ్బు పెట్టెను ఎత్తుకొచ్చింది. గోడపై కూర్చుని దాన్ని కొరకడం స్టార్ట్ చేసింది. కాసేపటికి..
కోతి చేష్టల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చాలా వరకూ వాటి చేష్టలు సరదాగా అనిపించినా.. కొన్నిసార్లు తెగ చిరాకు తెప్పిస్తుంటాయి. ఇంటి బయటి వరకూ ఓకే గానీ.. కొన్నిసార్లు కోతులు ఇళ్లల్లోకి చొరబడి మరీ వస్తువులను ఎత్తుకెళ్తుంటాయి. అప్పుడప్పుడూ విలువైన వస్తువులను ఎత్తుకెళ్తూ.. చివరకు చుక్కలు చూపిస్తుంటాయి. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, తమాషా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కోతి గోడపై కూర్చుని సబ్బు తింటోంది. దీన్ని గమనించిన మహిళ.. కోతి దగ్గరికి వెళ్లి మందలించింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి బయట ప్రహరీ గోడపై కోతి కూర్చుని ఉంది. కామ్‌గా కూర్చుని ఉండుంటే సమస్య లేదు గానీ.. ఆ కోతి ఇంటి బాత్‌రూమ్‌లోకి వెళ్లి మరీ సబ్బు పెట్టెను ఎత్తుకొచ్చింది. గోడపై కూర్చుని దాన్ని కొరకడం స్టార్ట్ చేసింది. కాసేపటికి దీన్ని గమనించిన మహిళ.. కోపంగా కోతి వద్దకు వెళ్లింది. ‘హేయ్ కోతీ ఏం చేస్తు్న్నావ్ నువ్వు.. సబ్బు ఎవరైనా తింటారా.. ఇవిగో ఈ బంగాళాదుంపలు తీసుకుని దాన్ని ఇక్కడే పడేయ్’.. అని చిన్న పిల్లలను మందలించిన తరహాలో గట్టిగా అరిచింది.
దెబ్బకు ఆ కోతికి బుద్ధి వచ్చినట్లుంది. చేతిలోని సబ్బు (monkey threw the soap box) పెట్టెను వెంటనే కింద పడేసి, ఆమె ఇచ్చిన బంగాళాదుంపలను తీసుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఆమె కూడా కోతికి టాటా బెబుతూ చేయి ఊపుతూ సంతోషంగా విష్ చేసింది. చిన్న పిల్లలను కంట్రోల్‌లో పెట్టినట్లుగా, ఆ మహిళ కోతిని భయపెట్టడం చూసి.. ఆమె కొడుకు తెగ నవ్వుకున్నాడు. ఈ ఘటనను మొత్తం వీడియో తీస్తూ.. తన తల్లి కోతిని భయపెట్టిన తీరును వివరిస్తూ నవ్వుతునే ఉన్నాడు. మా ఈజ్ ఆల్‌వేస్ మా..అంటూ సంబరపడిపోయాడు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిపై అంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘తల్లి ఎప్పటికీ తల్లే’.. అంటూ కొందరు, ‘కోతిని భలే కంట్రోల్‌లో పెట్టిందిగా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త రాస్తున్న సమయానికి ఈ వీడియో.. 2 లక్షలకు పైగా లైక్‌లు, 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
హెల్మెట్‌ను ఇలాక్కూడా వాడొచ్చు.. ఇతడి తెలివి చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..