Share News

ఇంత డేంజరస్ ఫీల్డింగ్ ఎప్పుడైనా చూశారా.. ఇతనేం చేశాడో చూడండి..

ABN , Publish Date - Apr 09 , 2026 | 01:57 PM

ఓ పల్లెటూరిలో యువకులంతా కలిసి గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్‌మ్యాన్‌ బలంగా కొట్టాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

ఇంత డేంజరస్ ఫీల్డింగ్ ఎప్పుడైనా చూశారా.. ఇతనేం చేశాడో చూడండి..

ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోందని చెప్పొచ్చు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా క్రికెట్‌కు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలావుండగా గ్రామాల్లో క్రికెట్ ఆడే సమయంలో కొన్నిసార్లు తమాషా సంఘటనలు జరిగితే.. మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, అంతా అవాక్కయ్యే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా .. ‘మా జీవితంలో ఇంత డేంజరస్ ఫీల్డింగ్ ఎప్పుడూ చూడలేదు’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పల్లెటూరిలో యువకులంతా కలిసి గ్రౌండ్‌లో (Young people playing cricket) క్రికెట్ ఆడుతున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్‌మ్యాన్‌ బలంగా కొట్టాడు. దెబ్బకు బంతి గాల్లోకి లేచి గ్రౌండ్ దాటి వెళ్లిపోయింది. అయితే దూరంగా ఉన్న ఓ ఫీల్డర్.. ఆ బంతిని పట్టుకునేందుకు పరుగులు తీశాడు. ఈ క్రమంలో అతడి కళ్లు కేవలం బంతిపై మాత్రమే ఉన్నాయి.


ఎంతో వేగంగా పరుగెత్తిన అతను.. చివరకు బంతిని క్యాచ్ పట్టుకోలేకపోయాడు. అయితే ఈ క్రమంలో అక్కడే ఉన్న గోడను చూసుకోకుండా.. నేరుగా వెళ్లి గుద్దేశాడు. దీంతో ధబేల్‌మని (man fell after hitting wall) దూరంగా పడిపోయాడు. దెబ్బకు అతడి కళ్లు బైర్లు కమ్మినంత పనైంది. అంతా ఆ వెంటనే పైకి లేచి, తనకేమీ జరగనట్లుగా ప్రవర్తించాడు. అతడు గోడను గుద్దిన వేగం చూస్తుంటే.. ముఖంపై గట్టి దెబ్బ పడినట్లే అనిపిస్తోంది. ఇలా అతను బంతిపై దృష్టి పెట్టి.. ఎదురుగా ఉన్న గోడను చూసుకోకుండా సమస్యను కొనితెచ్చుకున్నాడు.


ఈ యువకుడి ఫీల్డింగ్‌పై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత సిన్సియర్‌గా ఫీల్డింగ్ చేసే వాడిని ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇతని డెడికేషన్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి ఫీల్డర్‌ను ఎప్పుడూ చూడలేదు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త రాస్తున్న సమయానికి వీడియో 1300కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

హెల్మెట్‌ను ఇలాక్కూడా వాడొచ్చు.. ఇతడి తెలివి చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2026 | 02:02 PM