Share News

కళ్లు మూసి తెరిచేలోగా.. భోజనాల వద్ద ఇతడి టాలెంట్ చూడండి..

ABN , Publish Date - Apr 10 , 2026 | 07:46 AM

ఓ శుభకార్యంలో అతిథులంతా భోజనాలు చేస్తున్నారు. అయితే అక్కడ బఫే సిస్టం కాకుండా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. దీంతో అతిథులంతా కుర్చీల్లో వరుసగా కూర్చొన్నారు. భోజనాలు వడ్డించే సమయం అవగానే ముందుగా..

కళ్లు మూసి తెరిచేలోగా.. భోజనాల వద్ద ఇతడి టాలెంట్ చూడండి..

టాలెంట్ అనేది ఎవరి సొత్తూ కాదు అని పెద్దలు అన్నట్లు.. కొందరు పైకి సాధారణంగా అనిపించినా వారిలో ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంటుంది. సందర్భానుసారం ఆ టాలెంట్ బయటికి వస్తుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి టాలెంట్.. క్షణాల్లో వీడియోల రూపంలో వైరల్ అవుతోంది. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి భోజనాల వద్ద చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘వావ్.. వాట్ ఏ టాలెంట్’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ శుభకార్యంలో అతిథులంతా భోజనాలు చేస్తున్నారు. అయితే అక్కడ బఫే సిస్టం కాకుండా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. దీంతో అతిథులంతా కుర్చీల్లో వరుసగా కూర్చొన్నారు. భోజనాలు వడ్డించే సమయం అవగానే.. ముందుగా ఓ వ్యక్తి చేతిలో ప్లేట్లు పట్టుకుని వచ్చాడు. ప్లేటును ఒక్కో వ్యక్తి ముందు పెడుతూ పోవాల్సి ఉండగా.. ఇతను ఆ పనిని వినూత్నంగా చేశాడు.


ఒక చేతిలో ప్లేట్ల కట్టలను పట్టుకుని, మరో చేత్తో ఒక్కో ప్లేటును అత్యంత వేగంగా (man serves plates to guests at fastest) అతిథుల ముందు పెడుతూ వెళ్లాడు. ఇలా కళ్లు మూసి తెరిచేలోగా.. ఓ లైన్ మొత్తం కంప్లీట్ చేసేశాడు. చూస్తుండగానే అతిథులందరికీ ప్లేట్లను అందించాడు. చూసేందుకు ఇది రోబో పని చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇతని టాలెంట్ చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. కొందరు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇతను ఈ పనిలో పీహెచ్‌డీ చేసినట్లున్నాడు’.. అంటూ కొందరు, ‘ఈ టాలెంట్ అనితరసాధ్యం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త రాస్తున్న సమయానికి.. ఈ వీడియో 97కి పైగా లైక్‌లు, 1800కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

హెల్మెట్‌ను ఇలాక్కూడా వాడొచ్చు.. ఇతడి తెలివి చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2026 | 08:23 AM