Share News

కోపంతో పొడవడానికి వచ్చిన ఎద్దు.. ఇతను చేసిన చిన్న ట్రిక్‌తో.. చివరకు..

ABN , Publish Date - Apr 10 , 2026 | 10:15 AM

బుల్ ఫైట్ జరిగే మైదానంలోకి ఓ పెద్ద ఎద్దును వదిలారు. అదే సమయంలో ఓ వ్యక్తి లోపలికి వెళ్లాడు. అతన్ని చూడగానే ఎద్దు కోపంతో ఊగిపోయింది. దాడి చేసేందుకు అతడి వద్దకు వేగంగా వచ్చింది. చివరకు ఏమైందో చూడండి..

కోపంతో పొడవడానికి వచ్చిన ఎద్దు.. ఇతను చేసిన చిన్న ట్రిక్‌తో.. చివరకు..

బుల్ ఫైట్‌ అంటే మనకు భీకరమైన దృశ్యాలు గుర్తుకొస్తుంటాయి. కోపంతో ఊగిపోయే ఎద్దును కంట్రోల్ చేయాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. దాడి చేయబోయే ఎద్దు నుంచి తప్పించుకుంటూ.. దాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ ఎద్దు కోపంతో ఊగిపోతూ వ్యక్తిపై దాడి చేసేందుకు మైదానంలోకి వచ్చింది. తీరా దగ్గరికి వచ్చిన తర్వాత.. ఆ వ్యక్తి చేసిన చిన్న పనితో ఎద్దు చివరకు కూల్ అయిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బుల్ ఫైట్ జరిగే మైదానంలోకి ఓ పెద్ద ఎద్దును వదిలారు. అదే సమయంలో చేతికి బ్యాగు తగిలించుకున్న ఓ వ్యక్తి.. పొడవాటి కర్రతో లోపలికి వెళ్లాడు. అతన్ని చూడగానే ఎద్దు కోపంతో ఊగిపోయింది. దాడి చేసేందుకు అతడి వద్దకు వేగంగా వచ్చింది. అయినా అతను మాత్రం ఏమాత్రం కంగారు పడకుండా.. అక్కడే కూల్‌గా నిలబడ్డాడు.


ఎద్దు దగ్గరికి రాగానే.. దాని తలపై ప్రేమగా చేయి పెట్టి నిమిరాడు. ఆ తర్వాత దాని శరీరంపై కూడా చేతితో నిమిరాడు. దీంతో ఆ ఎద్దు ఒక్కసారిగా (bull calmed down by the man action) కూల్ అయిపోయింది. అంత కోపంతో వచ్చిన ఎద్దు.. అతడి చేసిన పనికి ఫిదా అయిపోయిది. తల కిందకు పెట్టి, అతడి వద్ద బుద్ధిగా నిలబడింది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా అవాక్కయ్యారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘జంతువులు తమను ప్రేమగా చూసుకునే వారి పట్ల ప్రేమగా ఉంటాయి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త రాస్తున్న సమయానికి.. వీడియో 14 వేలకు పైగా లైక్‌లు, 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

హెల్మెట్‌ను ఇలాక్కూడా వాడొచ్చు.. ఇతడి తెలివి చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2026 | 10:21 AM