పెళ్లిలో ఇలాంటి సౌకర్యాలు కూడా ఉంటాయా.. వీడియో చూస్తే..
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:19 AM
కళ్యాణ మంటపంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. లోపలికి అడుగుపెట్టగానే అక్కడి ఏర్పాట్లు చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు..
పెళ్లి అనగానే.. తలంబ్రాల సీన్‌తో పాటూ విందు భోజనాలు, డీజే డాన్స్‌లు, ఫొటోషూట్‌లు గుర్తుకొస్తాయి. ప్రతి పెళ్లిలో ఇవన్నీ ఉండడం సర్వసాధారణం. కొన్ని పెళ్లిళ్లలో ఇంకొన్ని అదనపు సౌకర్యాలు ఉండడం కూడా చూస్తుంటాం. అయితే ఓ పెళ్లిలో ఎవరూ ఊహించని విధంగా వింత ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి మంటపంలోకి అడుగుపెట్టగానే.. అక్కడి ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఏర్పాట్లు మామూలుగా లేవుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కళ్యాణ మంటపంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. లోపలికి అడుగుపెట్టగానే అక్కడి ఏర్పాట్లు చూసి (Strange arrangements at wedding) అంతా ముక్కున వేలేసుకున్నారు. భోజనాల స్టాల్స్ పక్కనే వింత ఏర్పాట్లు చేశారు. మంటపంలోకి వచ్చిన అతిథులు.. తమ నలిగిపోయిన దుస్తులను ఇస్త్రీ చేసేందుకు (Clothes iron) ఓ స్టాల్ ఏర్పాటు చేశారు.
అక్కడున్న వ్యక్తి.. దుస్తులను ఐరన్ చేస్తున్నాడు. కాస్త పక్కకి వెళ్తే.. షూ పాలిష్ (Shoe polish) చేసే వ్యక్తి కనిపించాడు. అక్కడ అంతా తమ షూలకు పాలిష్ చేయించుకుంటున్నారు. ఇంకాస్త లోపలికి వెళ్లగానే.. ఏకంగా ఓ కుర్చీ వేసి సెలూన్ తరహాలో ఏర్పాట్లు కనిపించాయి. అక్కడ కూర్చున్న అతిథులకు హెయిర్ స్టైల్స్‌తో (Hair styles) పాటూ మేకప్ కూడా చేస్తున్నారు. ఇలా పెళ్లికి వచ్చే అతిథులకు ఐరన్ దగ్గరి నుంచి షూ పాలిష్, మేకప్ ఇలా అన్ని విషయాల్లోనూ ఏర్పాట్లు చేశారు. వీరి ఏర్పాట్లు చూసి అంతా ఫిదా అవుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వాషింగ్ మెషిన్ ఒక్కటే తక్కువైంది.. అది కూడా పెట్టి ఉంటే బాగుండు’.. అంటూ కొందరు, ‘తాగి పడిపోయిన వారికి స్నానం చేసుకునే ఏర్పాట్లు కూడా చేసి ఉంటే బాగుండేది’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18 వేలకు పైగా లైక్‌లు, 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
హెల్మెట్‌ను ఇలాక్కూడా వాడొచ్చు.. ఇతడి తెలివి చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..