Share News

మొదటిసారి తండ్రి ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా.. గుండెలకు హత్తుకుంటున్న వీడియో..

ABN , Publish Date - Mar 09 , 2026 | 03:28 PM

ఓ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన కాసేపటికి వైద్యురాలు ఆ బిడ్డను తీసుకుని బయటికి వచ్చింది. బయటే ఆసక్తిగా ఎదురుచూస్తున్న తండ్రి చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే మొదటిసారి తండ్రి అయిన ఆ వ్యక్తి.. తన బిడ్డను చూడగానే..

మొదటిసారి తండ్రి ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా.. గుండెలకు హత్తుకుంటున్న వీడియో..

తండ్రి పాత్ర ఎంతో బాధ్యాయుతమైనది. కుటుంబంలో పిల్లల రక్షణ తల్లి చూసుకుంటే.. ఆ కుటుంబాన్ని మొత్తం తండ్రికి కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. అందుకే తండ్రి ఉంటే పిల్లలకు ఎక్కడ లేని ధైర్యం ఉంటుంది. బయటికి గంభీరంగా కనిపించే తండ్రి మనసులో.. పిల్లలపై చెప్పలేనంత ప్రేమ దాగి ఉంటుంది. పుట్టగానే మొదటిసారి తన పిల్లలను ఎత్తుకున్న క్షణంలో.. వారి స్పర్శ తాకగానే వింత అనుభూతికి లోనవుతాడు. తండ్రి అయ్యాననే ఫీలింగ్‌.. వారికి బయటికి చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడు మొదలైన ప్రేమ.. వారి జీవితాంతం అలాగే ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. మొదటిసారి తండ్రి అయిన ఓ వ్యక్తి తన బిడ్డను చేతిలోకి తీసుకున్న సన్నివేశం చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ వీడియో కోట్ల మంది హృదయాలకు హత్తుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చెన్నైకి చెందిన ఓ వైద్యురాలు (Chennai doctor) ఓ వీడియోను షేర్ చేశారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఓ గర్భిణి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన కాసేపటికి వైద్యురాలు ఆ బిడ్డను తీసుకుని బయటికి వచ్చింది. బయటే ఆసక్తిగా ఎదురుచూస్తున్న తండ్రి చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే మొదటిసారి తండ్రి అయిన ఆ వ్యక్తి.. తన బిడ్డను చూడగానే కంగారుపడ్డాడు. ఎక్కడ తన చేతులు తాకి.. బిడ్డకు ఏమవుతుందో ఏమో అని కంగారుపడ్డాడు.


పిల్లాడిని చేతుల్లోకి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తికి.. వైద్యురాలు ధైర్యం చెప్పింది. ఏం పర్వాలేదు.. చేతుల్లోకి తీసుకోండి.. అంటూ శిశువును తండ్రి చేతుల్లో పెట్టింది. మొదటిసారి బిడ్డను ఎత్తుకున్న ఆ తండ్రి.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అతడి ఫీలింగ్స్‌‌ను గమనించిన వైద్యురాలు.. కూల్ కూల్ అంటూ ఓదార్చింది. ఆ తర్వాత ఆ తండ్రి.. తన బిడ్డను కూల్‌గా పట్టుకుని ఎంతో మురిసిపోయాడు. బిడ్డపై తండ్రి ప్రేమకు నిదర్శనంగా నిలిచే ఈ ఘటన చూపరులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మొదటిసారి తండ్రి అయిన ప్రతి వ్యక్తికీ ఈ ఫీలింగ్ మరచిపోలేని జ్ఞాపకం’.. అంటూ కొందరు, ‘బ్యూటిపుల్ ముమెంట్.. అతడి రియాక్షన్స్ హార్ట్‌టచింగ్‌గా ఉన్నాయి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. రెండు రోజుల కింద పోస్టు చేసిన ఈ వీడియో.. ఈ వార్త రాస్తున్న సమయానికి 9.7 మిలియన్లకు పైగా లైక్‌లు, 202 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌‌ను ఎలా మార్చారో చూడండి..

వావ్..! వాట్ ఎ టాలెంట్.. ఈ డ్రైవర్ పనితనం చూస్తే శభాష్ అనాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 09 , 2026 | 03:29 PM