అత్యుత్సాహం అంటే ఇదే.. వధువును ఎత్తుకెళ్లాలని చూడగా.. చివరకు ఏమైందో చూడండి..
ABN , Publish Date - Mar 01 , 2026 | 02:49 PM
ఓ వివాహ వేడుకలో చోటు చేసుకున్న ఘటన.. అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. సిద్ధంగా ఉన్న వేదికపై వరుడు అప్పటికే నిలబడి ఉన్నాడు. ఈ సమయంలో వధువు అక్కడికి చేరుకుంది. అయితే..
ప్రతి ఒక్కరికీ పెళ్లి అనేది జీవితంలో మరపురాని మధుర జ్ఞాపకం. దీంతో ఆ రోజు జీవితాంతం గుర్తుండేలా చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం ఎంత ఖర్చుచేయడానికైనా వెనుకాడరు. కొందరు లక్షలు వెచ్చించి మరీ ఏర్పాట్లు చేస్తుంటారు. అంతటితో ఆగకుండా సినిమా తరహా సీన్లను రియల్‌గా క్రియేట్ చేస్తుంటారు. ఇలాంటి వీడియోల ద్వారా వారి వివాహం.. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటుంది. అలాగే కొన్నిసార్లు వారు అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి అన్నట్లుగా జరుగుతుంటుంది. ఏదో చేయబోతే చివరికి ఇంకోదే జరుగుతుంటుంది. ఇలాంటి సంఘటనలు కూడా నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధువును వేదికపైకి తీసుకెళ్లే సమయంలో వరుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ వేడుకలో (Marriage) చోటు చేసుకున్న ఘటన.. అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. సిద్ధంగా ఉన్న వేదికపై వరుడు అప్పటికే నిలబడి ఉన్నాడు. ఈ సమయంలో వధువు అక్కడికి చేరుకుంది. అయితే వేదిక ముందు ఆగి ఉన్న వధువును.. వరుడు పైకి ఆహ్వానించాల్సి వస్తుంది. ఈ క్రమంలో వరుడు చేయి చాపి.. వధువును వేదిక పైకి లాగేందుకు ప్రయత్నించాడు.
అయితే వధువు మాత్రం వేదికపైకి వెళ్లకుండా అక్కడే నిలబడి ఉంది. దీంతో చివరకు వరుడు పుష్ప సినిమా స్టైల్లో.. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. వేదిక పైనుంచి కిందకు వచ్చి.. ఆమెను పైకి ఎత్తుకుని వేదిక పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో (bride and groom fell down) ఇద్దరూ అదుపు తప్పి ధబేల్‌మని వేదికపై పడిపోయారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకున్నారు.
అక్కడున్న వారు ఈ ఘటను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ వరుడి ప్రయత్నానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’.. అంటూ కొందరు, ‘ఈ ఘటన జీవితాంతం మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 400కి పైగా లైక్‌లు, 49 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..
కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..