ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 26 , 2026 | 06:54 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Feb 26, 2026 08:39 IST
ప్రధాని మోదీ మరో రికార్డు..
100 మిలియన్ ఇన్‌స్టా ఫాలోవర్లతో ప్రపంచంలోనే నెం.1 నేతగా మోదీ
43.2 మిలియన్ ఫాలోవర్లతో నెం.2గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్
భారత్‌లోనూ నెం.1 ప్రధాని, తరువాతి స్థానంలో యోగీ ఆదిత్యనాథ్
-
Feb 26, 2026 08:20 IST
నేడు 11వ ప్రారంభంకానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీలో నేడు రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, సచివాలయాల సవరణ బిల్లుపై చర్చ
జలవనరుల శాఖ బడ్జెట్ పద్దులపై చర్చ, ఆమోదం
-
Feb 26, 2026 08:00 IST
విద్యార్థి జుట్టు కత్తిరించిన టీచర్.. తల్లిదండ్రుల ఆగ్రహం
కర్ణాటక: సింధనూరు హోలీఫ్యామిలీ విద్యాసంస్థలో దారుణం
విద్యార్థి జుట్టు కత్తిరించిన డ్రిల్ టీచర్
విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూలు ఫాదర్‌కి ఫిర్యాదు
-
Feb 26, 2026 07:56 IST
లా డిగ్రీ లేకున్నా న్యాయమూర్తిగా.. పాక్‌లో వింత ఘటన
జస్టిస్ తారిఖ్ మొహమ్మద్ నియామకం చెల్లదంటూ ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు
తారిఖ్ అవకతవకలకు పాల్పడి న్యాయడిగ్రీ పట్టా పొందారన్న న్యాయస్థానం
హైకోర్టు తీర్పును ఫెడరల్ కాన్‌స్టిట్యూషనల్ కోర్టులో సవాలు చేసిన జస్టిస్ తారిఖ్
-
Feb 26, 2026 07:45 IST
అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి అనగాని
గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి డోలా
-
Feb 26, 2026 07:37 IST
టీ-20 ప్రపంచ కప్ 2026: నేడు సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్
అహ్మదాబాద్ వేదికగా తలపడనున్న విండీస్, సఫారీ జట్లు
మధ్యాహ్నం 3:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం
ఈ మ్యాచ్‌పై ఆధారపడనున్న భారత్ సెమీస్ అవకాశాలు
-
Feb 26, 2026 07:29 IST
రెండో రోజు ఇజ్రాయెల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
పలు రంగాల్లో భారత్-ఇజ్రాయెల్ అవగాహనా ఒప్పందాలు
నేడు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్బోగ్‌తో ప్రధాని మోదీ చర్చలు
ఒప్పందాల తర్వాత భారత్-ఇజ్రాయెల్ ప్రధానుల మీడియా సమావేశం
సాయంత్రం 4 గంటలకు నెతన్యాహుతో ప్రతినిధి స్థాయి చర్చలు
నేడు భారతీయ యూదు సమాజ ప్రముఖులతో ప్రధాని భేటీ
-
Feb 26, 2026 07:28 IST
తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
నేటి నుంచి మార్చి 2 వరకూ తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
రాత్రి 7 గంటలకు పుష్కరిణిలో స్వామి, అమ్మవార్ల దర్శనం
తెప్పోత్సవాలతో నేడు, రేపు సహస్రదీపాలంకరణ సేవ
-
Feb 26, 2026 07:27 IST
నేటి నుంచి రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
నామినేషన్ల స్వీకరణకు గడువు తేదీ మార్చి 5
మార్చి 6న స్క్రూటినీ, మార్చి 9న నామినేషన్ల ఉపసంహరణ
మార్చి 16న పోలింగ్, అదే రోజు సాయంత్రం కౌంటింగ్
-
Feb 26, 2026 07:04 IST
పెరుగుతూనే ఉన్న పసిడి ధరలు
గతం వారం రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు
ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,61,900
కిలో వెండి ధర రూ.2,95,100
ఈ వారం ధరలు మరింత పెరిగే ఛాన్స్
-
Feb 26, 2026 06:59 IST
రాజంపేటలో అర్ధరాత్రి లాడ్జిలో చెలరేగిన మంటలు.. ఒకరి మృతి
కడప జిల్లా రాజంపేట రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న 'దీప్ లాడ్జి'లో భారీ అగ్ని ప్రమాదం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అర్ధరాత్రి వేళ లాడ్జిలో ఒక్కసారిగా మంటలు
లాడ్జిలోని 22 గదులకు వ్యాపించిన మంటలు, భవనం అంతా అలుముకున్న పొగ
లాడ్జిలో ఉన్న మొత్తం 33 మందిలో ఒకరి మృతి, 32 మందిని ఆస్పత్రికి తరలింపు
-
Feb 26, 2026 06:54 IST
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు
ఉదయం 11 గంటలకు మేయర్ పదవికి ఎన్నిక
దేవరకొండ సుజాతకు మేయర్ పదవి దక్కే అవకాశం