Share News

భారీ అగ్ని ప్రమాదం...ఎగసిపడుతున్న మంటలు

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:00 PM

జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.36లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళగౌరి షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగాయి.

భారీ అగ్ని ప్రమాదం...ఎగసిపడుతున్న మంటలు
Fire Accident

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26: నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.36లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళగౌరి షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు. మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. షాపింగ్ మాల్‌లో ఉన్న వస్త్రాలు, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి.


షాపింగ్ మాల్‌లో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో షాపింగ్ మాల్‌లో నలుగురు వ్యక్తులు ఉండగా.. వారు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


ఈ ప్రమాదంలో మొదటి నాలుగు అంతస్తులు పూర్తిగా దగ్ధమ్యయాయి. ఒక సిలిండర్ బ్లాస్ట్ కావడంతో ప్రమాద తీవ్ర మరింత పెరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మొదటి మూడు అంతస్తుల్లో ఉన్న వస్త్రాలు, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. ఇంక ఎవరైనా చిక్కుకుని ఉంటారనే అనుమానంతో ముందుగా అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. దట్టమైన పొగలు రావడంతో లోపలికి వెళ్లేందుకు ఫైర్ సిబ్బంది కాస్త ఇబ్బంది పడ్డారు. పోలీసులతో పాటు హైడ్రా అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రాజకీయాల్లోకి మావోయిస్టులు?

పింఛను పెంపు!

Updated Date - Feb 26 , 2026 | 12:54 PM