తగ్గిన బంగారం ధరలు! ప్రస్తుతం రేట్స్ ఇవీ
ABN , Publish Date - Feb 26 , 2026 | 10:21 AM
దేశంలో ప్రస్తుతం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు కొద్దిగా శాంతించాయి. భారత్‌లో గురువారం మేలిమి బంగారం ధర సగటున రూ.200ల మేర తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, హైదరాబాద్‌లో గురువారం ఉదయం 10.00 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.210ల మేర తగ్గి రూ.1,61,680కు చేరుకుంది. ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.200ల మేర తగ్గి రూ.1,48,200 వద్ద కొనసాగుతోంది (Gold, Silver Rates on Feb 26).
చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ.1,62,770ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో మేలిమి పసిడి ధర రూ.1,61,680గా, ఢిల్లీలో రూ.1,61,830గా ఉంది. కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో కూడా 24 క్యారెట్ పసిడి ధర రూ.1,61,680గా ఉంది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,49,200గా ఉంది. ముంబైలో రూ.1,48,200గా, ఢిల్లీలో రూ.1,48,350గా ఉంది. కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో ధర రూ.1,48,200ల వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని పలు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,85,000ల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,95,000గా ఉంది.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు (24కే, 22కే)
చెన్నై: ₹1,62,770; ₹1,49,200
ముంబై: ₹1,61,680; ₹1,48,200
ఢిల్లీ: ₹1,61,830; ₹1,48,350
కోల్‌కతా: ₹1,61,680; ₹1,48,200
బెంగళూరు: ₹1,61,680; ₹1,48,200
హైదరాబాద్: ₹1,61,680; ₹1,48,200
విజయవాడ: ₹1,61,680; ₹1,48,200
కేరళ: ₹1,61,680; ₹1,48,200
పుణె: ₹1,61,680; ₹1,48,200
వడోదరా: ₹1,61,730; ₹1,48,250
అహ్మదాబాద్: ₹1,61,730; ₹1,48,250
వెండి (కిలో) ధరలు ఇవీ
చెన్నై: ₹2,95,000
ముంబై: ₹2,85,000
ఢిల్లీ: ₹2,85,000
కోల్‌కతా: ₹2,85,000
బెంగళూరు: ₹2,85,000
హైదరాబాద్: ₹2,95,000
విజయవాడ: ₹2,95,000
కేరళ: ₹2,95,000
పుణె: ₹2,85,000
వడోదరా: ₹2,85,000
అహ్మదాబాద్: ₹2,85,000
గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ వార్తలూ చదవండి
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ
ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్ షురూ.. ఇక విదేశీ షేర్లలో నేరుగా పెట్టుబడులు