ఇక విదేశీ షేర్లలో నేరుగా పెట్టుబడులు
ABN , Publish Date - Feb 26 , 2026 | 06:10 AM
మన దేశం నుంచే అమెరికా స్టాక్ ఎక్స్చేంజిల్లో నమోదైన యాపి ల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లలో మదుపు చేయాలని ఉందా?.అయితే అందుకు సిద్ధం కండి. ఎన్‌ఎ్‌సఈ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజి...
ఎన్‌ఎ్‌సఈ ఐఎక్స్ కార్యకలాపాలు షురూ
ముందుగా అమెరికా షేర్లలో లావాదేవీలకు అనుమతి
న్యూఢిల్లీ: మన దేశం నుంచే అమెరికా స్టాక్ ఎక్స్చేంజిల్లో నమోదైన యాపి ల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లలో మదుపు చేయాలని ఉందా?.అయితే అందుకు సిద్ధం కండి. ఎన్‌ఎ్‌సఈ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజి (ఎన్‌ఎ్‌సఈ ఐఎక్స్) ఇందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ‘గ్లోబల్ యాక్సెస్’ పేరుతో ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఎన్‌ఎ్‌సఈ ఐఎక్స్ ఎండీ, సీఈఓ వీ బాలసుబ్రమణియం చెప్పారు. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా దేశీయ రిటైల్ మదుపరులు నేరుగా అమెరికా స్టాక్ మార్కెట్‌లో షేర్ల అమ్మకా లు, కొనుగోళ్లు చేయవచ్చు. వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో 30కిపైగా దేశాల స్టాక్ మార్కెట్ పెట్టుబడులను భారత రిటైల్ మదుపరులకు అందుబాటులోకి తెస్తామని సుబ్రమణియం తెలిపారు.
నమోదు: ముందుగా వెబ్ లేదా మొబైల్ ఇంటర్‌ఫేస్ ద్వారా ట్రేడింగ్ ఖాతా ఓపెన్ చేసుకోవాలి. ఆధార్, పాన్ కార్డు లేదా ఆయా వ్యక్తుల డిజిలాకర్ ద్వారా ఆన్‌లైన్‌లో డిజిటల్ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇందుకు అర నిమిషం నుంచి ముప్పావు నిమిషానికి మించి పట్టదు.
‘గ్లోబల్ యాక్సెస్’ ప్రత్యేకతలు
ఒక ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి పరిమితి 2.5 లక్షల డాలర్లు
విదేశీ స్టాక్ ఎక్స్చేంజిల్లో నమోదైన కంపెనీల షేర్లు, ఈటీఎ్‌ఫల్లో మాత్రమే పెట్టుబడికి అవకాశం
షేర్ల పాక్షిక కొనుగోళ్లకూ అవకాశం.
డాలర్లలో మాత్రమే పెట్టుబడులకు అనుమతి
ప్రస్తుతం రిటైల్ మదుపరులకు మాత్రమే అనుమతి
ముందు ముందు సంస్థాగత మదుపరులకూ విస్తరణ
ఇవి కూడా చదవండి..
మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో HOT పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..
ప్రియురాలి పెళ్లికి వచ్చిన ప్రియుడు.. అందరూ చూస్తుండగా ఏం చేశాడంటే.