పెరుగుతూనే ఉన్న పసిడి ధరలు! నేటి రేట్స్ ఇవీ
ABN , Publish Date - Feb 26 , 2026 | 06:45 AM
గత కొంతకాలంగా బంగారం, వెండి రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నడుమ గత కొన్ని రోజులుగా భారత్‌లో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం, గురువారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్10 గ్రాముల బంగారం స్పాట్ ధర రూ.1,61,900గా ఉంది. నిన్న ఇదే సమయానికి ఉన్న ధరతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,410 వద్ద కొనసాగుతోంది. నగరంలో వెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే రూ.5 వేల మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,95,100 వద్ద కొనసాగుతోంది (Gold, Silver Rates in India Feb 26).
అమెరికా సుంకాలు, వాణిజ్య ఒప్పందాల విషయంలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ధరల్లో పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కూడా బంగారం, వెండి ధరలను పరుగులు పెట్టిస్తున్నాయని చెబుతున్నారు. ధరలు మరింత పెరిగే అవకాశం కచ్చితంగా ఉందని అంటున్నారు.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు ఇవీ
చెన్నై: ₹1,62,890; ₹1,49,310
ముంబై: ₹1,61,900; ₹1,48,410
ఢిల్లీ: ₹1,62,050; ₹1,48,560
కోల్‌కతా: ₹1,61,900; ₹1,48,410
బెంగళూరు: ₹1,61,900; ₹1,48,410
హైదరాబాద్: ₹1,61,900; ₹1,48,410
విజయవాడ: ₹1,61,900; ₹1,48,410
కేరళ: ₹1,61,900; ₹1,48,410
పుణె: ₹1,61,900; ₹1,48,410
వడోదరా: ₹1,61,950; ₹1,48,460
అహ్మదాబాద్: ₹1,61,950; ₹1,48,460
వెండి (కిలో) ధరలు ఇవీ
చెన్నై: ₹2,95,100
ముంబై: ₹2,84,900
ఢిల్లీ: ₹2,84,900
కోల్‌కతా: ₹2,84,900
బెంగళూరు: ₹2,84,900
హైదరాబాద్: ₹2,95,100
విజయవాడ: ₹2,95,100
కేరళ: ₹2,95,100
పుణె: ₹2,84,900
వడోదరా: ₹2,84,900
అహ్మదాబాద్: ₹2,84,900
గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ వార్తలూ చదవండి
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ
ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్ షురూ.. ఇక విదేశీ షేర్లలో నేరుగా పెట్టుబడులు