Share News

సాహిల్‌ తల్లిదండ్రులకు రాహుల్‌ గాంధీ ఫోన్‌.. అండగా ఉంటానని భరోసా..

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:35 PM

ఐఐటీ విద్యార్థి సాహిల్‌ వాకోడే తల్లిదండ్రులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. న్యాయం కోసం వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసానిచ్చారు.

సాహిల్‌ తల్లిదండ్రులకు రాహుల్‌ గాంధీ ఫోన్‌.. అండగా ఉంటానని భరోసా..
Rahul Gandhi Calls Sahil Wakode parents

ఇంటర్నెట్ డెస్క్: ఐఐటీ విద్యార్థి సాహిల్‌ వాకోడే మృతిపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ.. బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. న్యాయం కోసం సాహిల్ తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలకు అన్నివిధాలా తోడుగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. సుమారు 17 నిమిషాల పాటు సాగిన ఈ వీడియో కాల్ సంభాషణలో.. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, అవసరమైన మేర సహాయ సహకారాలు అందిస్తానని రాహుల్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో నేషనల్ యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్ ఉదయ్‌ భాను చిబ్‌, మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేత శివరాజ్‌ మోరేలు మహారాష్ట్రలో సాహిల్ తల్లిదండ్రుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.


మరోవైపు.. సాహిల్‌ మృతి ఘటనపై న్యాయం కోరుతూ అతడి తల్లిదండ్రులు నిరసనకు సిద్ధమయ్యారు. తమ కుమారుడు కుల వివక్ష సంబంధిత వ్యాఖ్యలు, వేధింపుల గురించి తమతో చెప్పాడని వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఐఐటీ బాంబే ఖండించింది. ఎస్సీ, ఎస్టీ సెల్‌కూ ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఈ అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.


సాహిల్‌ మృతికి దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టేందుకు ఐఐటీ బాంబే 10 మంది సభ్యులతో బుధవారం(ఈ నెల 23న) ఓ అంతర్గత కమిటీని నియమించింది. ఈ కమిటీలో మాజీ విజిలెన్స్‌ అధికారి, విద్యార్థి ప్రతినిధులు ఉన్నారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదక సమర్పించాలని ఆదేశించినట్టు సమాచారం. కాగా.. విచారణ పూర్తయ్యే వరకు ప్రొఫెసర్‌ సూర్యనారాయణ దూల్లాను ఐఐటీ బాంబే యాజమాన్యం సెలవుపై పంపినట్టు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

కొడుకు అరెస్టుతో తండ్రి నేర చరిత్ర వెలుగులోకి.!

బిహార్‌లో దారుణం.. మరో బాలికపై లైంగిక వేధింపులు

Updated Date - Sep 24 , 2026 | 01:40 PM