Share News

కొడుకు అరెస్టుతో తండ్రి నేర చరిత్ర వెలుగులోకి.!

ABN , Publish Date - Sep 24 , 2026 | 07:46 AM

కొడుకుపై నమోదైన వేధింపుల కేసు దర్యాప్తులో తండ్రి నేరం వెలుగులోకి వచ్చింది. రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న అతడి తండ్రి 2003 నాటి జంట హత్య కేసులో నిందితుడని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

కొడుకు అరెస్టుతో తండ్రి నేర చరిత్ర వెలుగులోకి.!

ఇంటర్నెట్ డెస్క్: 'వెతకబోయిన తాడు కాలికి తగిలినట్టు' అన్నట్టు బిహార్‌లో ఓ కేసులో కొడుకును అరెస్ట్ చేయడంతో తండ్రి నేర చరిత్ర బయటపడింది. జముయిలో బాలికను వేధించిన కేసులో నిందితుడైన యువకుణ్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఓ హత్య కేసులో ఇరవైయేళ్లుగా పరారీలో అతడి తండ్రి కూడా నిందితుడని తేలింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకెళితే...


పదో తరగతి విద్యార్థిపై రోడ్డుపై దాడికి పాల్పడటం సహా అతడి స్నేహితురాలైన ఓ బాలికను వేధించిన కేసులో నందన్‌ యాదవ్‌ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్టైన వారిలో ఇద్దరు మైనర్లూ ఉన్నట్టు సమాచారం. ఆ తర్వాత నందన్ యాదవ్ కుటుంబ నేపథ్యాన్ని పరిశీలించడంతో తండ్రి గనోరి యాదవ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2003 ఏప్రిల్‌ 3న ప్రతాప్‌పుర్‌‌లో వ్యాపార వివాదంలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు.. గనోరి యాదవ్‌ నిందితుడని తేలింది. కానీ అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. సుమారు 2 దశాబ్దాలుగా తప్పించుకు తిరుగుతున్న గనోరి కోసం మరోసారి తీవ్రంగా గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. అనంతరం అతణ్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.


ఇవీ చదవండి:

మెజారిటీ నిర్ణయాలు కాకుంటే చట్టవిరుద్ధమే!

ఒక జట్టు కెప్టెనే అంపైర్‌ను ఎంపిక చేసుకున్నట్లుంది!

Updated Date - Sep 24 , 2026 | 07:46 AM