Share News

బీడీఎల్‌తో రక్షణ శాఖ భారీ డీల్‌

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:30 AM

ఆకాశం నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయగల శాటిలైట్‌ స్మార్ట్‌ యాంటీ ఎయిర్‌ఫీల్డ్‌ ఆయుధాల కొనుగోలు కోసం రక్షణ శాఖ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)తో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది.

బీడీఎల్‌తో రక్షణ శాఖ భారీ డీల్‌
DEFENSE DEAL

  • రూ.810.79 కోట్ల విలువైన 160 శాటిలైట్‌ స్మార్ట్‌ యాంటీ ఎయిర్‌ఫీల్డ్‌ ఆయుధాల కొనుగోలు ఒప్పందం

న్యూఢిల్లీ/అల్వాల్‌, సెప్టెంబరు 23: ఆకాశం నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయగల శాటిలైట్‌ స్మార్ట్‌ యాంటీ ఎయిర్‌ఫీల్డ్‌ ఆయుధాల కొనుగోలు కోసం రక్షణ శాఖ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)తో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.810.79కోట్ల విలువైన ఈ ఒప్పందం ప్రకారం 2027-29 మధ్య వాయుసేనకు బీడీఎల్‌ 160 ఎస్‌ఏటీఎఎస్ఏఏడబ్ల్యు ప్రిసిషన్‌ గైడెడ్‌ గ్లైడ్‌ బాంబులను సరఫరా చేస్తుంది. వీటిని వాయుసేనలోని జాగ్వార్‌, హాక్‌, ఎస్‌యూ-30 ఎంకేఐ యుద్ధ విమానాలకు అమర్చుతారు. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ సింగ్‌ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ బాంబులను డీఆర్‌డీవో తయారు చేయగా, బీడీఎల్‌ ఉత్పత్తి చేస్తోంది. ఇవి భూమిపై ఉన్న శత్రు స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో నాశనం చేయగలవు. వీటిని 90 నుంచి 100 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించే అవకాశం ఉండటంతో శత్రుదేశాల రాడార్లకు మన విమానాలు చిక్కకుండానే దాడి చేయగలవు.

Updated Date - Sep 24 , 2026 | 05:30 AM