Share News

కేంద్రం కీలక నిర్ణయం.. కమర్షియల్ గ్యాస్ సరఫరా 20శాతం పెంపు

ABN , Publish Date - Mar 21 , 2026 | 06:00 PM

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు.

కేంద్రం కీలక నిర్ణయం.. కమర్షియల్ గ్యాస్ సరఫరా 20శాతం పెంపు
Central Government

ఢిల్లీ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. రాష్ట్రాలకు అదనంగా మరో 20శాతం కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈనెల 23వ తేదీ నుంచి అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు.


ఇటీవల 10శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని నీరజ్ మిట్టల్ స్పష్టం చేశారు. తాజాగా మరోసారి 20 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సూచించారు. పారిశ్రామిక క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పాడి పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలతో నడిపించే రాయితీ క్యాంటీన్లు, అవుట్‌లెట్లు, కమ్యూనిటీ కిచెన్‌లకు సరఫరా అయ్యేలా చూడాలని ఆయా రాష్ట్రాలకు నీరజ్ మిట్టల్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరు గ్యారంటీలకు రేవంత్, భట్టి ఘోరీ కట్టారు: హరీశ్‌రావు

పది పరీక్షలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. వాటి విలువ ఎంతంటే

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 21 , 2026 | 06:11 PM