Share News

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం.. ఐదుగురు విద్యార్థుల గల్లంతు

ABN , Publish Date - Mar 20 , 2026 | 02:50 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం.. ఐదుగురు విద్యార్థుల గల్లంతు
Bhadradri Kothagudem District Incident

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం (Bhadradri Kothagudem District Incident) చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.


అసలేం జరిగిందంటే.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో గల SRM యూనివర్సిటీ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఏడుగురు విద్యార్థుల బృందం సెలవుల నేపథ్యంలో భద్రాచలం పర్యటనకు వచ్చారు. భద్రాచలం - కూనవరం రహదారిలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంపు ప్రాంతంలో గోదావరి నది అందాలను చూసేందుకు వారు వెళ్లారు. ఈ క్రమంలో ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. అయితే.. నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడం, ప్రవాహ వేగం అకస్మాత్తుగా పెరగడంతో విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. గట్టుపై ఉన్న మిగిలిన ఇద్దరు విద్యార్థులు గట్టిగా కేకలు వేయడంతో చేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


గల్లంతైన విద్యార్థుల వివరాలు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గల్లంతైన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి. సతీశ్ – మదనపల్లి(చిత్తూరు జిల్లా), నవదీప్ – ఉయ్యూరు(కృష్ణా జిల్లా), తేజజ్ఞ – ఉయ్యూరు(కృష్ణా జిల్లా), అభిరామ్ – భద్రాచలం, శ్రీకర్ – భద్రాచలానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో ఇద్దరు భద్రాచలానికి చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విప్‌ల నియామకం..

హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హరీశ్‌రావుతో ఆయిల్ పామ్ సాగు చేయించే బాధ్యత నాది: తుమ్మల నాగేశ్వరరావు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 03:57 PM