Share News

ఢిల్లీలో హై అలర్ట్‌.. ప్రధాని, కేంద్ర మంత్రులకు బాంబు బెదిరింపులు

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:06 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులకు మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆగంతకులు మెయిల్‌ ద్వారా బెదిరించారు. ఈ ఈమెయిల్ బీజేపీ నేత విజేందర్ గుప్తాకు రావడం గమనార్హం.

ఢిల్లీలో హై అలర్ట్‌.. ప్రధాని, కేంద్ర మంత్రులకు బాంబు బెదిరింపులు
Bomb Threat

ఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులకు ఈరోజు(మంగళవారం) బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆగంతకులు మెయిల్‌లో బెదిరించారు. ఈమెయిల్ బీజేపీ నేత విజేందర్ గుప్తాకు రావడం గమనార్హం. దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. బెదిరింపు సమాచారం అందిన వెంటనే ఢిల్లీ పోలీసులు, బాంబు స్క్వాడ్ అప్రమత్తమయ్యాయి.


అగ్రనేతలకు బాంబు బెదిరింపులు..

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాల పేర్లను ఈ ఈమెయిల్‌లో ఆగంతకులు ప్రస్తావించారు. ఈ నేతలందరికీ హాని తలపెడతామని లేదా వారి కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఈమెయిల్‌లో ఆగంతకులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ మెయిల్ రావడంతో కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రధాని, కేంద్రమంత్రుల నివాసాల దగ్గర తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.


ఢిల్లీ అసెంబ్లీ, విధానసభ మెట్రో స్టేషన్‌‌లకు..

అలాగే, దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. అత్యంత కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ భవనం, విధానసభ మెట్రో స్టేషన్‌లను లక్ష్యంగా చేసుకుని వచ్చిన ఈ బెదిరింపు ఈమెయిల్ భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేసింది. ఢిల్లీలో శాసనసభ భవనాన్ని, సమీపంలోని విధానసభ మెట్రోస్టేషన్‌ను పేల్చివేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఈమెయిల్‌లో కేవలం భవనాలను పేల్చివేస్తామని మాత్రమే కాకుండా, అగ్ర నాయకులే లక్ష్యంగా బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణం, విధానసభ మెట్రో స్టేషన్ వద్ద భద్రతా అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అణువణువూ గాలించి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించుకున్నారు.


సైబర్ క్రైమ్ దర్యాప్తు..

ప్రయాణికుల భద్రత దృష్ట్యా మెట్రో స్టేషన్ వద్ద భద్రతను రెట్టింపు చేశారు. సీసీటీవీ దృశ్యాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది?, ఎవరు పంపారు? అనే కోణంలో సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈమెయిల్ ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు.


పెరిగిన బాంబు బెదిరింపులు..

ఇటీవల విమానాశ్రయాలు, పాఠశాలలు, హోటళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. చాలా వరకు ఇవి ‘హోక్స్’ (Hoax - తప్పుడు బెదిరింపులు) అని తేలుతున్నప్పటికీ, దేశ రాజధానిలోని అత్యంత భద్రత ఉండే అసెంబ్లీ, మెట్రో స్టేషన్ల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. ప్రజలు, ప్రయాణికులు ఆందోళన చెందవద్దని, భద్రతా తనిఖీలకు సహకరించాలని పోలీసులు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం రేవంత్‌రెడ్డి

ఘోర ప్రమాదం: మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.. ఒకరికి సీరియస్

బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య.. సీఎంపై కిషన్‌రెడ్డి ధ్వజం

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 24 , 2026 | 12:25 PM