-
-
Home » Mukhyaamshalu » Andhrapradesh Telangana National International news ABN Andhrajyothy Live Updates of 11th March 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 11 , 2026 | 07:22 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 11, 2026 21:25 IST
లారీని ఢీకొట్టిన బస్సు.. వ్యక్తి మృతి..
సిద్దిపేట జిల్లా: ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం..
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి, డ్రైవర్‌తో పాటూ ఇద్దరు ప్రయాణికులకు గాయాలు..
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు..
క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్న గజ్వేల్ పోలీసులు..
-
Mar 11, 2026 21:01 IST
ముస్లింలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంది: మంత్రి ఫరూఖ్
పెద్దపులిపాకలో ఈద్గా స్థలం ఏర్పాటు చేశాం: మంత్రి ఫరూఖ్
ఈనెల 16న ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు..
ముస్లింల సంక్షేమంపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: ఫరూఖ్
-
Mar 11, 2026 20:59 IST
ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ముందడుగు
రేపు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో..
సాగర్ డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన..
ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్..
సిస్టమ్స్ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్న సంస్థ..
తొలిదశలో రూ.45 కోట్ల పెట్టుబడి, 750 మందికి పైగా ఉపాధి..
-
Mar 11, 2026 20:45 IST
ఏపీలో LPG నిల్వలు, సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం..
LPG నిల్వలపై సీఎం చంద్రబాబుకు వివరించిన అధికారులు..
LPG సహా ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితులను..
ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు మంత్రుల కమిటీ..
కమిటీలో మంత్రులు అచ్చెన్న, పయ్యావులు, నాదెండ్ల..
-
Mar 11, 2026 20:12 IST
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం: ట్రంప్
ఇరాన్‌లో అన్ని లక్ష్యాలనూ ఛేదించాం: ట్రంప్
ఇరాన్ దగ్గర ఇంకేమీ మిగల్లేదు: ట్రంప్
నేను ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుంది: డొనాల్డ్ ట్రంప్
-
Mar 11, 2026 19:42 IST
ఐపీఎల్ షెడ్యూల్ విడుదల
ఈనెల 28న హైదరాబాద్ వర్సెస్ బెంగుళూరు మధ్య తొలి మ్యాచ్
-
Mar 11, 2026 18:52 IST
చిత్తూరు: అడవి బూదుగురు ప్రాథమిక పాఠశాలలో తప్పిన పెను ప్రమాదం
వంట గదిలో విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం..
వంటగదిలోని సామాగ్రి, పైకప్పు దగ్ధం..
విద్యార్థులను బయటకు పంపడంతో తప్పిన ప్రమాదం..
-
Mar 11, 2026 18:39 IST
అమరావతి: నెయ్యి కల్తీ పాపం వైసీపీని వదలదు: ధూళిపాళ్ల
కలియుగ దైవం అంశంలో తప్పు చేసినోళ్లు మట్టిలో కలవడమే: ధూళిపాళ్ల
హెరిటేజ్, సంగం డెయిరీలది దశాబ్ధాల ప్రస్థానం: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
-
Mar 11, 2026 18:37 IST
కావూరి సాంబశివ రావు జీవితం ఆదర్శప్రాయం: జస్టిస్ బట్టు దేవానంద్
కావూరి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్
43 ఏళ్ల రాజకీయ జీవితంలో కావూరి సేవలు మరువలేనివి..
రాజకీయాల్లో సమున్నత విలువలు పాటించిన ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం: జస్టిస్ బట్టు దేవానంద్
-
Mar 11, 2026 18:27 IST
లోక్‌సభ స్పీకర్‌పై వీగిన అవిశ్వాసం
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం పెట్టిన విపక్షాలు..
సుదీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటుతో వీగిన అవిశ్వాసం..
లోక్‌సభ రేపటికి వాయిదా..
-
Mar 11, 2026 17:36 IST
జగన్ ఆర్థిక వనరుల గురించి మాట్లాడటం విడ్డూరం: టీడీపీ ఎంపీ అప్పలనాయుడు
దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది..
జగన్ చిట్టా మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది: ఎంపీ అప్పలనాయుడు
-
Mar 11, 2026 17:33 IST
లోక్‌సభ: స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానంపై అమిత్ షా ప్రసంగం
40 ఏళ్ల తర్వాత స్పీకర్‌పై అవిశ్వాసం వచ్చింది: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
స్పీకర్‌కు రాజకీయాలతో సంబంధం లేదు..
స్పీకర్‌పై అవిశ్వాసం చాలా తప్పు..
అన్ని పార్టీల ఆమోదంతోనే స్పీకర్ ఎంపిక జరిగింది: అమిత్ షా
-
Mar 11, 2026 17:32 IST
ఐపీఎల్ 2026: మరికాసేపట్లో షెడ్యూల్ విడుదల
నేడు సాయంత్రం 7 గంటలకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం..
మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026..
తొలి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడనున్న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్..
-
Mar 11, 2026 17:01 IST
జగన్‌కు.. మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్..
జగన్ గూగుల్, ఏఐ హబ్‌కు వ్యతిరేకంగా కోర్టులో పిల్ వేయించారు: లోకేష్
అభివృద్ధి నిరోధకుడుగా పేరుగాంచిన జగన్..
ఏపీ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు: మంత్రి లోకేష్
-
Mar 11, 2026 16:58 IST
అమరావతి: ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులపై మంత్రి పార్థసారథి సీరియస్
ఏలూరు RMOకు మంత్రి పార్థసారథి వార్నింగ్..
ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది తీరు మారడం లేదని మంత్రి ఆగ్రహం..
రోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం ఏంటి?: పార్థసారథి
శిశువు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు: మంత్రి పార్థసారథి
-
Mar 11, 2026 16:56 IST
కావూరి సాంబశివరావు మృతికి పవన్ సంతాపం
మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారని తెలిసి చింతించా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను..
సాంబశివరావు సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నారు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
-
Mar 11, 2026 16:13 IST
రాజ్యాంగం సాక్షిగా కాంగ్రెస్ ద్వంద్వ నీతి: ఎంపీ సురేశ్ రెడ్డి
స్పీకర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు: ఎంపీ సురేశ్ రెడ్డి
పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆత్మ విమర్శ చేసుకోవాలి: ఎంపీ సురేశ్ రెడ్డి
-
Mar 11, 2026 16:09 IST
చెట్టును ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి..
పార్వతీపురం: మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఆమిటీ సమీపంలో రోడ్డు ప్రమాదం..
విజయనగరానికి చెందిన బట్టల వ్యాపారి అనీల్ జైన్ మృతి..
వ్యాపారి భార్య జ్యోతి జైన్‌తో పాటూ డ్రైవర్ పరిస్థితి విషమం
విజయనగరం నుండి ఒడిశా వెళ్తుండగా ఘటన..
-
Mar 11, 2026 15:59 IST
కేటీఆర్‌కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్
పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టిందే కేసీఆర్..
రాహుల్‌ను విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదు..
-
Mar 11, 2026 15:58 IST
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
1342 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్..
395 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ..
-
Mar 11, 2026 15:41 IST
ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడటం విడ్డూరం: మంత్రి సీతక్క
బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకున్నారు: మంత్రి
కేటీఆర్ నీతిమంతుడైనట్టు మాట్లాడుతున్నారు: మంత్రి
స్పీకర్ తన పరిధి మేరకే నిర్ణయం తీసుకున్నారు: మంత్రి సీతక్క
-
Mar 11, 2026 15:32 IST
ఒడిశా: కంధమాల్‌లో మావోయిస్టుల లొంగుబాటు
రూ.1.65 కోట్ల రివార్డు ఉన్న 10 మంది మావోయిస్టుల లొంగుబాటు..
లొంగిపోయిన వారిలో కీలక మావోయిస్ట్ స్టేట్ కమిటీ సభ్యురాలు నీతు..
-
Mar 11, 2026 15:17 IST
దేశ యువతపై రాహుల్‌కు అవగాహన లేదు: ప్రధాని మోదీ
కేరళ ఎర్నాకుళంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం..
యుద్ధం పేరుతో నన్ను కాంగ్రెస్ దూషిస్తోంది: మోదీ
యుద్ధంపై కాంగ్రెస్, వామపక్షాలు తప్పుడు ప్రచారం..
గల్ఫ్‌లో భారతీయులు చిక్కుకోవాలని కాంగ్రెస్ కాంక్షిస్తోంది..
రాహుల్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు: ప్రధాని నరేంద్ర మోదీ
-
Mar 11, 2026 15:09 IST
ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారు
ఇరాన్ అధ్యక్షుడి తనయుడు యూసఫ్ వెల్లడి..
ఇజ్రాయెల్ తొలిదాడుల్లో మొజ్తాబా గాయపడినట్టు వార్తలు..
ఇరాన్ సుప్రీం నేతగా ఎన్నికైన తర్వాత బహిరంగంగా కనిపించని మొజ్తాబా..
-
Mar 11, 2026 15:04 IST
పశ్చిమాసియాలో ఐటీ కంపెనీలకు ఇరాన్ హెచ్చరికలు
గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM, ఎన్విడియా, ఒరాకిల్ సహా..
దిగ్గజ ఐటీ సంస్థలకు ఇరాన్ సైన్యం హెచ్చరికలు
పశ్చిమాసియాలో యుద్ధం విస్తరిస్తోంది: IRGC
మా ప్రత్యర్థులకు సహకరించే సంస్థలపై దాడులు తప్పవు: IRGC
-
Mar 11, 2026 14:37 IST
ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు: కేంద్ర మంత్రి బండి సంజయ్
ఎమ్మెల్యేలు కడియం, దానం నాగేందర్‌లపై అనర్హత పిటిషన్‌ను డిస్మిస్ చేయడం దారుణం..
కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది..
అనర్హత వేటు వర్తించకపోవడం సిగ్గు చేటు: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
-
Mar 11, 2026 13:40 IST
తిరుమల పరకామణి చోరీ కేసుపై భాను ప్రకాశ్ రెడ్డి కామెంట్స్
చోరీ చేసిన ఉద్యోగిని అప్పుడే అరెస్ట్ చేసి.. బంగారం రికవరీ చేశారు
ఇప్పుడు కొత్తగా జరిగినట్లు వార్తలు రాస్తున్నారు
తిరుమల హుండీకి కానుకలు రాకుండా కుట్ర
-
Mar 11, 2026 13:30 IST
విజయవాడ: గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశం
రంగంలోకి దిగిన పౌరసరఫరాల శాఖ అధికారులు
విజయవాడలోని సర్కిల్ 1, 2, 3 ప్రాంతాల్లో తనిఖీలు
గృహ అవసరాలకు తీసుకుని హోటల్‌లో వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
మధురానగర్, దుర్గాపురంలో హోటల్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్లు సీజ్
-
Mar 11, 2026 13:27 IST
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందే బీఆర్ఎస్ పార్టీ: పీసీసీ చీఫ్ మహేష్
ఫిరాయింపుల గురించి కేటీఆర్ మాట్లాడడం సిగ్గు చేటు
తన పరిధిలోనే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు
కేటీఆర్, హరీష్ ఏం మాట్లాడిన ప్రజలు నమ్మే స్థితిలో లేరు
-
Mar 11, 2026 13:25 IST
అమరావతి: కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలు
కృష్ణా, గోదావరి బేసిన్ సంస్థలోని మానిటరింగ్, అప్రైజల్ డైరెక్టరేట్‌ను..
వెంటనే రాజమండ్రికి మార్చాలని ఆదేశాలు
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న డైరెక్టరేట్ చీఫ్ ఇంజనీర్‌కు ఆదేశాలు
సంబంధిత విభాగాల్లోని అధికారులను బదిలీ చేయాలని ఆదేశాలు
వారం రోజులలో విభాగాలు మార్చే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు
-
Mar 11, 2026 13:20 IST
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం
ప్రధాని మోదీ ఎప్పుడూ రాజీ పడలేదు: రవిశంకర్ ప్రసాద్
ఇప్పుడు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రస్తావన వచ్చింది
పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినప్పుడు చర్చకు ఆస్కారం లేదు
రాహుల్ స్పీకర్‌ను చాలాసార్లు అవమానించారు
-
Mar 11, 2026 13:18 IST
స్పీకర్‌పై అవిశ్వాసం చర్చలో రాహుల్ ప్రసంగం
ఇంతకుముందు స్పీకర్‌పై గౌరవం ఉండేది: రాహుల్
కానీ గత సమావేశాల్లో తొలిసారి విపక్ష నేతను మాట్లాడనివ్వలేదు
మోదీ వైఫల్యాలపై మాట్లాడితే స్పీకర్ అనుమతినివ్వలేదు
చాలా అంశాల్లో మోదీ రాజీ పడ్డారని ఇంతకుముందే చెప్పా
-
Mar 11, 2026 12:25 IST
ఢిల్లీ హైకోర్టును తాకిన గ్యాస్ కొరత
హైకోర్టు క్యాంటీన్‌లో నిలిచిపోయిన భోజన సదుపాయం
గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా వంటకు అంతరాయం
గ్యాస్ సరఫరా లేక నిలిపివేశామన్న క్యాంటీన్ నిర్వాహకులు
-
Mar 11, 2026 12:16 IST
మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రం కీలక నిర్ణయం
నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందే అమలుకు అవకాశం
2023లో పార్లమెంట్ ఆమోదించిన చట్టంలో సవరణలు చేసే అవకాశం
బడ్జెట్ మలి విడత సమావేశాల్లో సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యం
-
Mar 11, 2026 11:58 IST
కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి చికిత్స నిలిపియోచ్చన్న సుప్రీంకోర్టు
13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీశ్ రాణా(32)
తన కొడుక్కి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ తండ్రి పిటిషన్
-
Mar 11, 2026 11:39 IST
హైదరాబాద్: లోక్‌భవన్‌లో కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం
గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ప్రమాణస్వీకారం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్
కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు
తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
-
Mar 11, 2026 11:11 IST
కడియం, దానంకు క్లీన్‌చిట్ ప్రజాస్వామ్యంపై దాడి: కేటీఆర్
కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిన వ్యక్తికే క్లీన్‌చిట్ ఇవ్వడం దారుణం
ప్రజా తీర్పును అవమానించడమే
స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి: కేటీఆర్
-
Mar 11, 2026 10:50 IST
స్పీకర్ నాపై అనర్హత వేటు వేసినా పోరాటం ఆపను: దానం నాగేందర్
ఎంపీగా పోటీ చేయడం నా వ్యక్తిగత విషయం: దానం
హైదరాబాద్ అభివృద్ధి కోసం సీఎంతో కలిసి పనిచేస్తున్నా: దానం
బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏరోజు పనిచేయలేదు: దానం
ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే నేను సిద్ధం: దానం
-
Mar 11, 2026 10:48 IST
హైదరాబాద్‌లో పెరుగుతున్న గ్యాస్ కష్టాలు
ఒక్కొక్కటిగా మూతపడుతున్న హోటళ్లు
గ్యాస్ వినియోగం తగ్గిస్తున్న హోటళ్లు
హోటళ్లు మూతబడితే పలు కుటుంబాలు రోడ్డునపడతాయని ఆవేదన
-
Mar 11, 2026 10:47 IST
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు అమాంతం పెరిగిన బుకింగ్స్
గ్యాస్ కొరత ప్రచారంతో డొమెస్టిక్ గ్యాస్‌కి పెరిగిన బుకింగ్స్
డొమెస్టిక్ సిలిండర్లకు ఎలాంటి ఇబ్బంది లేదన్న గ్యాస్ ఏజెన్సీలు
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ తీసుకోని ఏజెన్సీలు
-
Mar 11, 2026 10:46 IST
అమరావతి: 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు
హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల అమలు, జిల్లాల వారీ లక్ష్యాలపై సమీక్ష
రాష్ట్రాభివృద్ధి దిశగా అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Mar 11, 2026 10:39 IST
హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సంచలన తీర్పు
దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
దానం, కడియం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించిన స్పీకర్
విచారణ సమయంలో దానం, కడియం ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకున్న స్పీకర్
తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు విచారణలో తెలిపిన దానం, కడియం
-
Mar 11, 2026 10:20 IST
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 360, నిఫ్టీ 105 పాయింట్లకు పైగా నష్టం
-
Mar 11, 2026 09:20 IST
మంచిర్యాల: సింగరేణిపై యుద్ధం ఎఫెక్ట్
వెంటాడుతున్న డీజిల్, పేలుడు పదార్థాల కొరత
బొగ్గు, మట్టి తవ్వకాలు, తరలింపు కోసం రోజుకు సగటున 10 లక్షల లీటర్ల డీజిల్ అవసరం
డిమాండ్‌కు సరిపడా డీజిల్ సరఫరా చేయలేమని చేతులెత్తేసిన ఇంధన సంస్థలు
మరో వైపు నిలిచిపోయిన విదేశీ బొగ్గు, పేలుడు పదార్థాల దిగుమతి
బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం
-
Mar 11, 2026 09:13 IST
హైదరాబాద్: నటి లావణ్య త్రిపాఠి కేసు దర్యాప్తు ముమ్మరం
లావణ్య త్రిపాఠిని ఆన్‌లైన్‌లో వేధించిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్
ఐడీ వివరాలు ఇవ్వాలని ఇన్‌స్టాగ్రామ్‌కు సైబర్‌క్రైమ్ పోలీసుల లేఖ
అనుచిత, పరువుకు భంగం కలిగించే అంశాలను తొలగించాలని పేర్కొన్న లావణ్య
ఫిర్యాదుతోపాటు ఆధారాలుగా 11 స్క్రీన్ షాట్స్‌ను పోలీసులకు ఇచ్చిన లావణ్య
లావణ్య త్రిపాఠికి 15 వారాలుగా వేధింపులు
ఇన్‌స్టాలో పర్పుల్ క్రెయాన్ 00 అకౌంట్ ఐడీ ఉన్న వ్యక్తి
లావణ్య త్రిపాఠి కేసుపై పోలీసు శాఖ సీరియస్
-
Mar 11, 2026 09:09 IST
చర్లపల్లి - కామాఖ్యా మధ్య అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్
ఈ నెల 13న ప్రారంభించనున్న ఇండియన్ రైల్వేస్
స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో నడవనున్న అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్
తెలుగు రాష్ట్రాల్లో 12 స్టేషన్లలో ఆగనున్న ట్రైన్
శ్రీకాకుళం రోడ్, విజయనగరం, పెందుర్తి, దువ్వాడ..
సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ..
విజయవాడ, గుంటూరు, నల్లగొండలో ఆగనున్న రైలు
-
Mar 11, 2026 09:05 IST
లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ
అమిత్‌షా ప్రసంగం తర్వాత అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్
-
Mar 11, 2026 09:05 IST
బంగ్లాదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత
బంగ్లాదేశ్‌ను ఆదుకోవడానికి ముందుకొచ్చిన ఇండియా
1,80,000 టన్నుల డీజిల్ సరఫరాకు ఒప్పందం
5 వేల టన్నుల డీజిల్ సరఫరా
-
Mar 11, 2026 09:01 IST
లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ
అమిత్‌షా ప్రసంగం తర్వాత అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్
-
Mar 11, 2026 09:01 IST
కాకినాడ, పోలవరం జిల్లాల్లో పులి సంచారం
పత్తిపాడు మండలం దారపల్లి దగ్గర పులి సంచరిస్తున్నట్లు గుర్తింపు
ఏలేరు రిజర్వాయర్ దగ్గర 10 రోజులుగా పులి సంచారం
-
Mar 11, 2026 08:46 IST
పెద్దపల్లి: ఆర్ఎఫ్‌సీఎల్‌లో యూరియా ఉత్పత్తి తగ్గించిన యాజమాన్యం
యుద్ధ ప్రభావంతో సగానికి తగ్గిన యూరియా ఉత్పత్తి
ఎల్‌ఎన్‌జీ సరఫరా తగ్గించిన గ్యాస్ ఆథారిటి ఆఫ్ ఇండియా లిమిటెడ్
రోజుకు 1700 టన్నులు ఉత్పత్తి చేస్తున్న రామగుండం ఎరువుల కర్మాగారం
ఎల్‌ఎన్‌జీ సరఫరాను గెయిల్ మరింత తగ్గిస్తే.. త్వరలో షట్‌డౌన్
-
Mar 11, 2026 08:44 IST
నేడు వెలుగుమట్లలో భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ
ఖమ్మం కలెక్టరేట్‌లో 311 మందికి ఇళ్ల పత్రాల పంపిణీ
మరో 101 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు
పట్టాలు పంపిణీ చేయనున్న భట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల
-
Mar 11, 2026 08:43 IST
ఏపీలో నేటి నుంచి 2 రోజులపాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఉ.10:30కి సీఎం చంద్రబాబు ప్రసంగం
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల అమలు, జిల్లాలవారీ లక్ష్యాలపై సమీక్ష
రెండో రోజు ప్రజారోగ్యం, సంక్షేమ పథకాల అమలు..
రెవెన్యూ, వేసవిలో తాగునీటి ప్రణాళికలపై చర్చ
రేపు సాయంత్రం శాంతిభద్రతలపై ప్రత్యేక సెషన్
-
Mar 11, 2026 08:37 IST
ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో నల్లటి ఆమ్ల వర్షం
చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులే కారణం
పలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న బ్లాక్ రెయిన్
ఇరాన్ వాసులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సూచనలు
-
Mar 11, 2026 08:36 IST
హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా దాడి
జలసంధి సమీపంలో మోహరించిన మైన్‌లేయర్స్, నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు
6 ఇరానియన్ మైన్‌లేయర్లను ధ్వంసం చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన
-
Mar 11, 2026 08:36 IST
తెలంగాణ: ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు స్పీకర్ తీర్పు
దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్న స్పీకర్
ఉదయం 10 గంటలకు తీర్పు వెల్లడించనున్న గడ్డం ప్రసాద్
రేపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ
సుప్రీంకోర్టు విచారణకు ముందే స్పీకర్ తీర్పు
-
Mar 11, 2026 08:30 IST
ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలు
విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
జవాబుపత్రంపైన గ్రాఫ్, మ్యాప్‌పై కానీ హాల్ టికెట్ నెంబరు వేయకూడదు
నెంబరు వేసిన జవాబుపత్రాలను మాల్‌ప్రాక్టీసుగా పరిగణించే ప్రమాదం
పరీక్ష హాలులో ఇచ్చే జవాబు పత్రాలపై తప్పనిసరిగా క్రమ సంఖ్య ముద్రించి ఉండాలి
క్రమసంఖ్య లేని జవాబు పత్రాలను తిరిగి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి
-
Mar 11, 2026 08:16 IST
చార్మినార్ షహ్రాన్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం
మినీ గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు
ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
-
Mar 11, 2026 07:47 IST
దేశంలో చిన్న నోట్ల కొరతను తీర్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం
రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి
ఏటీఎంల ద్వారా చిన్న నోట్లను అందించేందుకు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్టు వెల్లడి
రూ.10, రూ.20, రూ.50 నోట్లను ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం
-
Mar 11, 2026 07:30 IST
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,390
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,860
హైదరాబాద్‌లో కిలో వెండి ధర దాదాపు రూ.3 లక్షలుగా ఉంది
-
Mar 11, 2026 07:28 IST
హర్మూజ్ జలసంధిలో స్తంభించిన నౌకల రాకపోకలు
భారత్‌లో ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం
భారత్‌కి రసాయనాలు, ఎరువుల సరఫరాకు అంతరాయం
-
Mar 11, 2026 07:24 IST
నేడు గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణస్వీకారం
కొత్త గవర్నర్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్న చీఫ్ జస్టిస్
లోక్‌భవన్‌లో కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి