Share News

హర్మూజ్‌ జలసంధి సమీపంలో దాడి.. 16 ఇరాన్ మైన్‌లేయర్స్ ధ్వంసం..

ABN , Publish Date - Mar 11 , 2026 | 08:20 AM

అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధి సమీపంలో అమెరికా భీకర దాడులు చేపట్టింది. హర్మూజ్‌ జలసంధి సమీపంలో 16 ఇరానియన్ మైన్‌లేయర్లను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.

హర్మూజ్‌ జలసంధి సమీపంలో దాడి.. 16 ఇరాన్ మైన్‌లేయర్స్ ధ్వంసం..
Iranian mine boats destroyed

అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధి సమీపంలో అమెరికా భీకర దాడులు చేపట్టింది. హోర్ముజ్ జలసంధి సమీపంలో 16 ఇరానియన్ మైన్‌లేయర్లను తమ సైన్యం ధ్వంసం చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. కీలకమైన హర్మూజ్‌ జలమార్గంలో మైన్‌లేయర్స్‌ను ఉంచవద్దని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు (US Iran tensions).


ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ సైన్యం పట్టించుకోకపోవడంతో అమెరికా సైన్యం దాడులకు పాల్పడింది (Strait of Hormuz news). హర్మూజ్‌ జలసంధి సమీపంలో మోహరించిన మైన్‌లేయర్స్, నౌకలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. దీంతో అవి ధ్వంసమయ్యాయి. తమ దాడుల్లో ఇరాన్‌కు చెందిన నౌకలతో పాటు 16 మైన్‌లేయర్లు ధ్వంసమయ్యాయని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఇది ఎంత ప్రమాదకరమంటే..

బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 11 , 2026 | 11:51 AM