Share News

బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Mar 11 , 2026 | 06:31 AM

బంగారం, వెండి ధరలు బుధవారం ఉదయం స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండికి డిమాండ్ ఏర్పడింది.

బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

బంగారం, వెండి ధరలు బుధవారం ఉదయం స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండికి డిమాండ్ ఏర్పడింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత మార్గాల వైపు చూస్తుండడంతో ధరలు పెరుగుతున్నాయి (Gold prices).


ఈ రోజు (మార్చి 11న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,62,390 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,860 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,62,540కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,49,010కి చేరుకుంది.


మరోవైపు వెండి ధర కూడా మళ్లీ పెరుగుతోంది. బుధవారం కిలోకు వంద రూపాయల మేర పెరుగుదల నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ.1,62,390, రూ.1,48,860

  • విజయవాడలో రూ.1,62,390, రూ.1,48,860

  • ఢిల్లీలో రూ.1,62,540, రూ.1,49,010

  • ముంబైలో రూ.1,62,390, రూ.1,48,860

  • వడోదరలో రూ.1,62,440, రూ.1,48,910

  • కోల్‌కతాలో రూ.1,62,390, రూ.1,48,860

  • చెన్నైలో రూ.1,62,390, రూ.1,48,860

  • బెంగళూరులో రూ.1,62,390, రూ.1,48,860

  • కేరళలో రూ.1,62,390, రూ.1,48,860

  • పుణెలో రూ.1,62,390, రూ.1,48,860


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ.3,00,100

  • విజయవాడలో రూ.3,00,100

  • ఢిల్లీలో రూ.2,90,100

  • చెన్నైలో రూ.3,00,100

  • కోల్‌కతాలో రూ.2,90,100

  • కేరళలో రూ.3,00,100

  • ముంబైలో రూ.2,90,100

  • బెంగళూరులో రూ.2,90,100

  • వడోదరలో రూ.2,90,100

  • అహ్మదాబాద్‌లో రూ.2,90,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఈ వార్తలూ చదవండి:

ఒకే బోగీలో 30 మంది.. ఈ ఫ్యామిలీ రచ్చ చూస్తే..

సముద్రం ఒడ్డున అరుదైన చేప.. మరో విపత్తు రానుందా?

Updated Date - Mar 11 , 2026 | 07:14 AM