Share News

ఒకే బోగీలో 30 మంది.. ఈ ఫ్యామిలీ రచ్చ చూస్తే..

ABN , Publish Date - Mar 09 , 2026 | 06:19 PM

ముప్ఫై మంది సభ్యులున్న ఒక కుటుంబం రైల్లో చేసిన రచ్చ తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతూ జనాలకు ఆగ్రహం తెప్పిస్తోంది.

ఒకే బోగీలో 30 మంది.. ఈ ఫ్యామిలీ రచ్చ చూస్తే..
Garib Rath train viral video

ఇంటర్నెట్ డెస్క్: గరీబ్ రథ్‌ రైల్లో ఒక కుటుంబం చేసిన రచ్చ అంతాఇంతా కాదంటూ మరో ప్రయాణికుడు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. వాళ్ల గొడవ తట్టుకోలేక తాము చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని మన్మోహన్ వర్మ అనే మరో ప్యాసింజర్ ఈ వీడియోను షేర్ చేశారు.

ఇటీవల తను ప్రయాణించిన రైల్లో ఒకే కుటుంబానికి సుమారు 30 మంది నానా రచ్చ చేశారని మన్మోహన్ వర్మ తెలిపారు. బోగీ మొత్తం తమ సొంత స్టూడియో అన్నట్టు ఇష్టారీతిన ప్రవర్తించారని అన్నారు. పెద్ద శబ్దంతో పాటలు పెట్టి, డ్యాన్స్‌లు చేస్తూ, అరచి గోల చేస్తూ మిగతా వారికి ప్రశాంతతను దూరం చేశారని అన్నారు. రీల్స్ చేస్తూ నానా రభసా సృష్టించారని అన్నారు. చుట్టుపక్కల వారి ప్రశాంతతకు భంగం వాటిల్లుతున్నా వారు అస్సలు పట్టించుకోలేదని అన్నారు. కొన్ని గంటల పాటు ఇలా రభస సాగడంతో చివరకు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని అన్నారు.


‘ఇదంతా చూశాక నాకు ఒక సందేహం కలిగింది. అసలు మనలో కొందరికి కనీస పౌర స్పృహ కూడా ఎందుకు ఉండదో అని అనిపించింది. రైలు బోగీలో అనేక మంది ప్రయాణిస్తుంటారు. రైలు అనేది ఎవరి సొంతమూ కాదు. తోటి ప్రయాణికులను గౌరవిస్తూ హుందాగా నడుచుకోవడంపై ఎందుకు అంత నిర్లక్ష్యం? ప్రజా రవాణా సాధనాల్లో వెళుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా నడుచుకుంటే జర్నీని చక్కగా ఆనందించొచ్చు అని మన్మోహన్ వర్మ కామెంట్ చేశారు. దీంతో, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


ఈ వార్తలూ రాయండి:

సముద్రం ఒడ్డున అరుదైన చేప.. మరో విపత్తు రానుందా?

మహిళ ఇక్కట్ల పాలు ! మరో దారి లేక దుబాయ్ హోటల్‌లో దిగితే..

Updated Date - Mar 09 , 2026 | 08:40 PM