Share News

ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఇది ఎంత ప్రమాదకరమంటే..

ABN , Publish Date - Mar 11 , 2026 | 07:14 AM

ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో సతమతమవుతున్న ఇరాన్ వాసులను మరోవైపు నల్లటి ఆమ్ల వర్షం ఆందోళనకు గురి చేస్తోంది. చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో నల్లటి ఆమ్ల వర్షం కురిసినట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి.

ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
Toxic rain in Iran

ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో సతమతమవుతున్న ఇరాన్ వాసులను మరోవైపు నల్లటి ఆమ్ల వర్షం ఆందోళనకు గురి చేస్తోంది. చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో నల్లటి ఆమ్ల వర్షం కురిసినట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ వర్షం కారణంగా ఇరాన్ వాసులు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ఆకాశంలో పొగ, కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు వర్షపు చినుకులు కిందకు పడుతూ పొగ, ఆయిల్ కణాలు, కాలుష్యాన్ని కూడా తీసుకువస్తాయి. అందుకే ఆ వర్షం నల్లగా లేదా మురికి నీటిలా కనిపిస్తుంది (Black rain in Iran).


తాజాగా ఇరాన్‌లోని చమురు కేంద్రాలపై దాడుల వల్ల భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటల కారణంగా పొగ, ఆయిల్ కణాలు, విషపూరిత వాయువులు గాల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత వర్షం పడినప్పుడు ఆ కాలుష్య కణాలు వర్షపు నీటితో కలిసి భూమి మీదకు చేరాయి. ఈ బ్లాక్ రెయిన్ ఆరోగ్యానికి హానికరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ ఆమ్ల వర్షం వల్ల శ్వాస సమస్యలు, కంటి సమస్యలు, తలనొప్పి, దగ్గు, చర్మ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది (Toxic rain Iran).


ఈ ఆమ్ల వర్షం నేపథ్యంలో ఇరాన్ వాసులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సూచనలు చేసింది (Health risks black rain). అవసరమైతే తప్ప బయటకు వెళ్లడం తగ్గించాలని, నల్లటి వర్షం నీటిని తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళితే మాస్క్ ధరించడం, శరీరమంతా కప్పే రెయిన్ కోట్ వేసుకోవడం వంటివి చేయాలని సూచించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.


ఈ వార్తలూ చదవండి:

ఒకే బోగీలో 30 మంది.. ఈ ఫ్యామిలీ రచ్చ చూస్తే..

సముద్రం ఒడ్డున అరుదైన చేప.. మరో విపత్తు రానుందా?

Updated Date - Mar 11 , 2026 | 07:14 AM