త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం: ట్రంప్
ABN , Publish Date - Mar 11 , 2026 | 08:26 PM
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యద్ధం భీకరంగా సాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తామన్నారు.
వాషింగ్టన్, మార్చి 11: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యద్ధం భీకరంగా సాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగియవచ్చన్నారు. అమెరికా దళాలు ఇప్పటికే టెహ్రాన్ సైనిక సామర్థ్యాలపై భారీ నష్టాన్ని కలిగించాయని చెప్పారు. యుద్ధం జరుగుతుందని పేర్కొన్నారు. అనుకున్న సమయం కంటే చాలా మందున్నామన్నారు.
ఆరు వారాల్లో అనుకున్నదాని కంటే అధిక నష్టాన్ని కలిగించామని చెప్పారు. ఇప్పటికే ఇరాన్‌లోని అన్ని లక్ష్యాలనూ ఛేదించామని తెలిపారు. ఇరాన్ వద్ద ఇంకేమీ మిగల్లేదని వెల్లడించారు. తాను ఎప్పుడనుకుంటే అప్పుడు ఈ యుద్ధం ఆగుతుందని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. బుధవారం ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.