ఐపీఎల్ 2026: షెడ్యూల్ వచ్చేసింది.. తొలి పోరులో తలపడేది ఎవరంటే?
ABN , Publish Date - Mar 11 , 2026 | 07:15 PM
క్రికెట్ అభిమానులు ఎప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2026 అధికారిక షెడ్యూల్ వచ్చేసింది.ప్రస్తుతానికి 20 మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 12 వరకు ఇవి కొనసాగనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఎప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2026 అధికారిక షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 28 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్ విడుదల కాస్త ఆలస్యమైంది. కాగా ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా ఈ సీజన్‌కు తెరలేవనుంది. ఈసారి రెండు దశల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి 20 మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 12 వరకు ఇవి కొనసాగనున్నాయి.
తొలి మ్యాచులో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ తలపడనున్నాయి. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్
టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్