Share News

జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:43 PM

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ది నిరోధకుడుగా పేరుగాంచిన జగన్ రెడ్డి.. మళ్లీ విమర్శల దాడి చేస్తున్నారంటూ మంత్రి లోకేశ్ అన్నారు.

జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్
Nara Lokesh

అమరావతి, మార్చి 11: మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ది నిరోధకుడుగా పేరుగాంచిన జగన్ రెడ్డి.. మళ్లీ విమర్శల దాడి చేస్తున్నారంటూ మంత్రి ఫైర్ అయ్యారు.


'జగన్ అమరావతిని వ్యతిరేకించారు. అలానే విద్యుత్ ఒప్పందాలను రద్దు చేశారు. ఐటీ ఉద్యోగ కల్పనకు వ్యతిరేకంగా జగన్(YS Jagan).. తన పార్టీ నేతలతో కోర్టులో పిల్స్ వేయిస్తున్నారు. వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న గూగుల్, ఏఐ హబ్ కు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీతో కోర్టులో పిల్ వేయించారు. ఏపీ యువత, అభివృద్ది అంటే జగన్‌కు ఎందుకు వ్యతిరేకతో అర్దం కావడంలేదు. వారు ఎన్ని అవరోధాలు సృష్టించిన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని ఎవరు ఆపలేరు' అని మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

జగన్ పాలన ‘రాక్షస యుగం’.. వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు

గుడివాడలో బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

Updated Date - Mar 11 , 2026 | 05:07 PM