మిచెల్‌కు అర్ష్‌దీప్ సారీ చెప్పాల్సిన అవసరమే లేదు: గంభీర్
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:11 PM
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మధ్య కాస్త ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వివాదంపై టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మధ్య కాస్త ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. మిచెల్ మీదకు అర్ష్‌దీప్ బంతి విసిరి క్షమాపణలు కూడా చెప్పకపోవడంతో వాతావరణం వేడెక్కింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలగజేసుకుని మిచెల్‌కు సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్, మిచెల్ కలిసి మీడియాతో చిట్ చాట్ చేశారు. మిచెల్‌ను క్షమాపణలు కోరుతూ అర్ష్‌దీప్ వివాదానికి తెరదించాడు. అయితే ఐసీసీ మాత్రం అర్ష్‌దీప్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 15శాతం జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో ఆ వివాదంపై టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ స్పందించాడు.
‘అదేమంత సమస్యే కాదు. మీరు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించేటప్పుడు దూకుడు చూపించాల్సిన అవసరం ఉంటుంది. బంతిని విసిరితే తప్పేంటి? వరుసగా రెండు సిక్స్‌లు కొట్టించుకోవాలని ఏ బౌలర్ అనుకోడు కదా.. ఆ తర్వాతి బంతికి అర్ష్‌దీప్ అలా చేశాడు. నా ప్లేయర్ల నుంచి నేను ఇలాంటిదే కోరుకుంటా. అందులో ఎలాంటి తప్పు లేదు. ఒకవేళ అతడు సారీ చెప్పకపోయినా సరే.. ఇబ్బందేమీ లేదు. క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే సారీ చెప్పి మంచి పనే చేశాడు. మైదానంలోకి దిగాక ఎవరూ స్నేహితులు ఉండరు. ఎవరూ శత్రువులు కూడా కారు. దేశం కోసం ఆడేటప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ సోషల్ మీడియా తరంలో ప్రతిదీ తప్పుబట్టడమే అవుతోంది’ అని గంభీర్ స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్
టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్