-
-
Home » Mukhyaamshalu » Andhrapradesh Telangana National International Latest and Breaking news ABN Andhrajyothy Live Updates of 14th March 2026 siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 14 , 2026 | 06:53 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 14, 2026 21:28 IST
తమిళ సాహితీ శిఖరం వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం
2025 ఏడాదికి గాను 60వ జ్ఞానపీఠ్ విజేతగా వైరముత్తు ఎంపిక
తమిళ కవిత్వానికి తొలిసారిగా దక్కిన అత్యున్నత సాహిత్య గౌరవం
24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తమిళ సాహిత్యానికి దక్కిన జ్ఞానపీఠ్
-
Mar 14, 2026 21:06 IST
ఘనంగా దేవాన్ష్ ధోతీ వేడుక..
హైదరాబాద్: అట్టహాసంగా నారా లోకేశ్- బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుక
సంప్రదాయబద్ధంగా నారా దేవాన్ష్ నూతన వస్త్ర బహుకరణ(ధోతీ) వేడుక
కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య శాస్త్రీయంగా కార్యక్రమం
తమ మనవడిని ఆశీర్వదించిన తాతలు చంద్రబాబు, బాలకృష్ణ
-
Mar 14, 2026 20:37 IST
గ్యాస్ కొరత పుకార్లను నమ్మెుద్దు: ఏపీ పౌరసరఫరాల శాఖ
దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఉందన్న వదంతులతో బుకింగ్స్ 15శాతం పెరిగాయి: ఏపీ పౌరసరఫరాల శాఖ
ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మెుద్దు: పౌరసరఫరాల శాఖ వినతి
-
Mar 14, 2026 20:34 IST
తమిళనాడు: కరూర్‌లో రైలు ప్రమాదం
ప్రైవేట్ కాలేజీ బస్సును ఢీకొన్న గూడ్స్ రైలు
18మందికి గాయాలు, ఆరుగురి పరిస్థితి విషమం
-
Mar 14, 2026 20:07 IST
కేసీఆర్ హయాంలో రూ.6కోట్లతో మూసీ సుందరీకరణ: కేటీఆర్
ఒక్క ఇల్లూ కూల్చకుండా గతంలో మూసీ సుందరీకరణ పనులు: కేటీఆర్
ఎన్నికల హామీల అమలుకు డబ్బుల్లేవు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్
మూసీ సుందరీకరణతో డబ్బులు వస్తాయని రేవంత్ ప్రచారం: కేటీఆర్
అందాల పోటీల నిర్వహణకు మాత్రం రూ.200కోట్లు వస్తాయి: కేటీఆర్
-
Mar 14, 2026 20:07 IST
గతంలో కేసీఆర్ నీటి నిర్వహణపై మాట్లాడారు : మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్
అభివృద్ధిపై కేసీఆర్ మాట్లాడితే రేవంత్‌రెడ్డి విధ్వంసంపై మాట్లాడారు: కేటీఆర్
రెండున్నర ఏళ్లలో పేదలకు ఒక్క ఇల్లైనా కట్టారా?: కేటీఆర్
హైదరాబాద్‌లో ఎన్ని వందల ఇళ్లు కూలగొట్టారో చూపిస్తాం: కేటీఆర్
-
Mar 14, 2026 20:03 IST
హైదరాబాద్: బేగంపేటలో అగ్నిప్రమాదం
మయూరి మార్గ్‌లోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం
-
Mar 14, 2026 18:30 IST
హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న నైజీరియన్ అరెస్ట్
8 ఏళ్లుగా భారత్‌లో ఉంటున్న నైజీరియన్ వ్యక్తి కెన్నీ
కేంద్రం అనుమతులతో నైజీరియాకు డిపోర్ట్
ఘనా దేశం నకిలీ పాస్‌పోర్ట్‌తో భారత్‌లోకి ప్రవేశం
సినిమాల్లో నటించేందుకు హైదరాబాద్ వచ్చిన నైజీరియన్
-
Mar 14, 2026 18:00 IST
భట్టి నివాసానికి చంద్రబాబు..
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి నివాసానికి ఏపీ సీఎం చంద్రబాబు
ఈనెల 5న భట్టి కుమారుడు విక్రమాదిత్య వివాహం సందర్భంగా..
నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు
-
Mar 14, 2026 17:19 IST
పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రధాని మోదీ
కోల్‌కతా బ్రిగేడ్ గ్రౌండ్స్‌లో ఎన్నికల ప్రచార సభ
బెంగాల్‌లో మమత ప్రభుత్వానికి ముగింపు తథ్యం: మోదీ
బెంగాల్‌లో చీకటి పాలన సాగుతోంది: ప్రధాని మోదీ
-
Mar 14, 2026 17:18 IST
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు కేంద్రం అనుమతి
ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై నిషేధం ఎత్తివేత
-
Mar 14, 2026 16:58 IST
పంట మార్పిడి చేయకపోతే రైతులు నష్టపోతారు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
లిఫ్ట్ ఇరిగేషన్ కింద హార్టికల్చర్ సాగు వైపునకు వెళ్లాలి: మంత్రి
వరి కొనబోమని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది: మంత్రి తుమ్మల
వరిసాగు చేస్తే భవిష్యత్తులో రైతులు, ప్రభుత్వానికి నష్టం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
-
Mar 14, 2026 16:45 IST
మాట ఇచ్చాం.. పనులు చేస్తాం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ భరోసా..
గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది: డిప్యూటీ సీఎం పవన్
ప్రధానమంత్రి నిధులతోనే ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం సాధ్యమైంది: డిప్యూటీ సీఎం పవన్
ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే 460 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాం: డిప్యూటీ సీఎం పవన్
-
Mar 14, 2026 16:44 IST
పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదు: కేంద్రం
కీలక ప్రకటన విడుదల చేసిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ
కంగారు పడి కొనుగోళ్లకు దిగవద్దని ప్రజలకు సూచన
సాధారణ కంటెయినర్లలో పెట్రోల్ నిల్వ ప్రమాదకరమని హెచ్చరిక
-
Mar 14, 2026 16:34 IST
రూ.60వేల పెట్టుబడితో నెలకు రూ.14 లక్షల ఆదాయం
తన బంధువు ఎలా కోటీశ్వరుడయ్యారో చెప్పిన స్టాక్ మార్కెట్ ట్రేడర్
36 ఏళ్ల క్రితం రూ.60 వేలతో నాలుగెకరాల భూమి కొనుగోలు
ఇటీవల రెండు ఎకరాలు విక్రయించడంతో రూ.25 కోట్లు
రూ.25 కోట్లను ఎఫ్‌డీ చేస్తే నెలకు రూ.14 లక్షల ఆదాయం
-
Mar 14, 2026 16:34 IST
మంచిర్యాల: కవ్వాల్ టైగర్ జోన్‌లో విషాదం.. చిరుత పులి మృతి
కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని తాళ్లపేట్ రేంజ్‌లో చిరుత పులి మృతి
ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న అధికారులు
నిందితుల నుంచి చిరుత గోర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
-
Mar 14, 2026 16:19 IST
టాంజానియాతో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం
డిజిటల్ ఎకానమీగా మారేందుకు టాంజానియాకు..
తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక సహకారం
ఐటీ, టూరిజం, హెల్త్‌కేర్ రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం
-
Mar 14, 2026 16:19 IST
HJ దొర అంత్యక్రియలు
హైదరాబాద్: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ HJ దొర అంత్యక్రియలు
రాయదుర్గం మహాప్రస్థానంలో HJ దొర అంత్యక్రియలు
-
Mar 14, 2026 16:00 IST
సర్‌ఛార్జి బాదుడు.. ఆకాశ ఎయిర్ టికెట్ ధరలకు రెక్కలు
కొత్త బుకింగ్‌లపై రూ.199 నుంచి రూ.1,300 వరకూ అదనపు భారం
పెంచిన టికెట్ ధరలు మార్చి 15 నుంచి అమలు
-
Mar 14, 2026 15:58 IST
వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే గల్లా మాధవి ఫైర్
జగన్ పాపాల భారాన్ని ప్రభుత్వంతోపాటు ప్రజలు మోస్తున్నారు: ఎమ్మెల్యే
స్కామ్‌లు చేయడానికే నవరత్నాలు పేరుతో ప్రజాధనాన్ని దోచేశారు: గల్లా మాధవి
వైసీపీ హయాంలో ప్రతిదీ కల్తీనే: ఎమ్మెల్యే గల్లా మాధవి
-
Mar 14, 2026 15:56 IST
పాక్ ప్లేయర్ మాజ్ సదాకత్ రికార్డ్
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో పాక్ ప్లేయర్ మాజ్ సదాకత్ రికార్డ్
బంగ్లాపై అర్ధ సెంచరీ, 3 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడిగా మాజ్ రికార్డ్
వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్
వరల్డ్ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన 14వ ప్లేయర్‌గా నిలిచిన మాజ్
-
Mar 14, 2026 15:54 IST
నిమిషంలో రూ.16 కోట్ల సొత్తు లూటీ..
అమెరికాలో భారత సంతతికి చెందిన వారి జ్యువెలరీ షాపు దోపిడీ
దాడి చేసిన ముసుగులు ధరించిన 20మంది ముఠా
నిమిషంలో రూ.16 కోట్ల సొత్తు లూటీ చేసిన దుండగులు
కాలిఫోర్నియాలోని 'కుమార్ జ్యువెలర్స్' దుకాణంలో ఘటన
-
Mar 14, 2026 15:20 IST
నమన్ అవార్డులు ప్రకటించిన BCCI
రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్, మిథాలీ రాజ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
రేపు ఢిల్లీలో అవార్డులు ప్రదానం
-
Mar 14, 2026 15:17 IST
ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులు
టెల్ అవీవ్, జెరూసలేం, బేర్షెబా నగరాలపై మిసైళ్లు, క్లస్టర్ బాంబులతో ఇరాన్ దాడులు
ఇరాన్ వరుస దాడుల భయంతో ఇళ్లు ఖాళీ చేసి హైవేల పక్కన ఆశ్రయం పొందుతున్న స్థానికులు
-
Mar 14, 2026 15:14 IST
కరీంనగర్: బండి సంజయ్ పాదయాత్రలో తేనెటీగల దాడి
రామడుగు మండలం కోనరావుపేటలో డ్రోన్ ఎగరవేసిన కార్యకర్తలు
తేనె తుట్టెకు డ్రోన్ తగలడంతో లేచిన తేనెటీగలు
అప్రమత్తమైన బండి సంజయ్, సిబ్బంది
నలుగురు బీజేపీ కార్యకర్తలపై తేనె టీగల దాడి, ఆస్పత్రికి తరలింపు
-
Mar 14, 2026 15:03 IST
హైదరాబాద్: బోరబండ పెద్దమ్మనగర్‌లో దారుణం
ఇద్దరు చిన్నారుల గొంతు నులిమి ఆపై తల్లి ఆత్మహత్య
కుమారుడు మృతి, కుమార్తె పరిస్థితి విషమం
కుటుంబకలహాలతో దారుణానికి పాల్పడిన మహిళ
-
Mar 14, 2026 14:56 IST
బంగ్లాతో జరిగిన రెండో వన్డేలో వివాదాస్పదమైన పాక్ ప్లేయర్ రనౌట్
ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం: సల్మాన్ అఘా
ఓ కెప్టెన్ ఇలా చేయడం సబబు కాదు: మహ్మద్ కైఫ్
-
Mar 14, 2026 14:53 IST
అస్సాంలో రూ.23,500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ
యుద్ధం ఎఫెక్ట్‌పై కాంగ్రెస్ భయాందోళనలు సృష్టిస్తోంది: అస్సాంలో ప్రధాని మోదీ
యుద్ధ ప్రభావం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం: మోదీ
-
Mar 14, 2026 14:21 IST
మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు, నాదెండ్ల భేటీ
గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ జరిగింది: మంత్రి పయ్యావుల
ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పౌరసరఫరాల అధికారులు హాజరయ్యారు: పయ్యావుల
గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: పయ్యావుల
గ్యాస్ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నాం: పయ్యావుల
-
Mar 14, 2026 13:22 IST
హోర్ముజ్ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు.. ఫలించిన భారత్ దౌత్యం
ఇండియా, ఇరాన్ నాయకత్వం మధ్య పలు రౌండ్ల చర్చలు ఫలప్రదం
ఇరాన్ విదేశాంగ మంత్రితో నాలుగు రౌండ్ల చర్చలు జరిపన జైశంకర్
ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్‌తో ఫోనులో మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ
-
Mar 14, 2026 13:12 IST
బిర్యానీపై రూ.30 నుంచి రూ.40 వరకూ పెరిగిన రేట్లు
గ్యాస్ కొరతతో రేటు పెరిగిన హైదరాబాదీ బిర్యానీ
ప్రతి ఆర్డర్‌పై రూ.40 వరకూ అదనపు వసూళ్లు
-
Mar 14, 2026 13:11 IST
కాకినాడ: ప్రత్తిపాడు ఏజెన్సీలో పులి సంచారం
జి.కొత్తపల్లిలో ఆవుపై పులి దాడి
భయాందోళనలో స్థానికులు
-
Mar 14, 2026 13:09 IST
లద్దాఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌పై నిర్బంధం ఎత్తివేత
లద్దాఖ్‌లో శాంతి సహా చర్చలకు అనుకూల వాతావరణం కోసమేనన్న కేంద్రం
సోనమ్ వాంగ్‌చుక్‌పై NSA నిర్బంధం ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటన
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ గతంలో వాంగ్‌చుక్ ఆందోళనలు
గతేడాది సెప్టెంబర్‌లో వాంగ్‌చుక్‌ను అరెస్టు చేసిన పోలీసులు
-
Mar 14, 2026 12:56 IST
మే 1 వరకు దుబాయ్‌కు ఎయిర్ కెనడా విమానాలు రద్దు
టొరంటో నుంచి దుబాయ్ వెళ్లే విమానాలు రద్దు
ప్రకటన విడుదల చేసిన ఎయిర్ కెనడా
-
Mar 14, 2026 12:55 IST
గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌పై డ్రోన్లతో దాడి
బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపైనా డ్రోన్ల దాడి
-
Mar 14, 2026 12:55 IST
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసిన అమెరికా
ఇరాన్ ప్రధాన చమురు క్షేత్రం ఖర్గ్ ఐలాండ్‌పై US బలగాల దాడి
అమెరికా దాడిలో పూర్తిగా ధ్వంసమైన ఖర్గ్ ఐలాండ్
-
Mar 14, 2026 12:39 IST
నేడు సాయంత్రం ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌తో మంత్రి ఉత్తమ్ సమావేశం
గ్యాస్ సరఫరా, డీలర్ల సమస్యలపై చర్చించనున్న మంత్రి ఉత్తమ్
క్షేత్రస్థాయి పరిస్థితులను ఉత్తమ్‌కు వివరించనున్న డిస్ట్రిబ్యూటర్లు
-
Mar 14, 2026 12:38 IST
అల్లూరి: జనసేన ఆవిర్భావ దినోత్సవం
పాడేరులో పార్టీ జెండా ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్
-
Mar 14, 2026 12:37 IST
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ నిర్లక్ష్యం
కూకట్‌పల్లి న్యూ ఎరా స్కూల్ విద్యార్థులకు అదే స్కూల్‌లో పరీక్షాకేంద్రం
అధికారులతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కమ్మక్కయిందని ఆరోపణలు
సాంకేతిక లోపం వల్లే పరీక్షాకేంద్రం వచ్చినట్లు DEO వివరణ
మరో పాఠశాల సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా నియమించినట్లు వెల్లడి
-
Mar 14, 2026 12:37 IST
హైదరాబాద్ వ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల కొరత
మూతపడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు
కట్టెల పొయ్యిపైనే ప్రముఖ హోటళ్లలో వంటలు
గ్యాస్ సంక్షోభంతో ఆందోళనలో హోటల్ వ్యాపారులు
-
Mar 14, 2026 12:36 IST
హైదరాబాద్: పోచారంలో దారుణం
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్ చేసిన యువకుడు
యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Mar 14, 2026 11:24 IST
ఢిల్లీ: కేంద్రమంత్రి అన్నపూర్ణదేవితో ముగిసిన మంత్రి సీతక్క భేటీ
నిర్భయ నిధి కింద ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై ధన్యవాదాలు తెలిపిన సీతక్క
శిశు సంరక్షణ కేంద్రం వర్కర్లకు వేతనాలు పెంచాలని కోరా: సీతక్క
వేతనాల పెంపునకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు: సీతక్క
-
Mar 14, 2026 11:22 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రోన్ కెమెరాలు సీజ్
రూ.50 లక్షల విలువైన 70 డ్రోన్లను సీజ్ చేసిన కస్టమ్స్
సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు అరెస్ట్
-
Mar 14, 2026 11:22 IST
అమరావతి: పలువురు మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
గ్యాస్ సరఫరా అంశంపై మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వపరంగా ఎంత చేయాలో అంత చేయాలి: సీఎం
కేంద్రంతో సమన్వయం చేసుకుని సమస్య లేకుండా చూడాలి: సీఎం
వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలి: సీఎం
ప్రజలు ఆందోళన చెందకుండా చూడాలి: సీఎం
-
Mar 14, 2026 11:21 IST
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పీఏ శ్రీనివాస్ అరెస్ట్
పెళ్లి పేరుతో దళిత యువతిని మోసం చేసినట్టు శ్రీనివాస్‌పై ఫిర్యాదు
మరో మహిళా ఎస్ఐతో వివాహానికి సిద్ధమవడంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు
శ్రీనివాస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు, రిమాండ్‌కు తరలింపు
-
Mar 14, 2026 11:19 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వివిధ దేశాలకు పలు విమానాలు రద్దు
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో సర్వీసులు రద్దు చేస్తున్న విమానయాన సంస్థలు
వివిధ సంస్థలకు చెందిన మొత్తం 13 విమానాలు రద్దు
-
Mar 14, 2026 11:19 IST
గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలు, ఎంబసీలపై ఇరాన్ దాడులు
మిస్సైల్స్, డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్
సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై దాడి
USకు చెందిన 5 రీఫ్యూయెలింగ్ విమానాలు దెబ్బతిన్నట్టు సమాచారం
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై మిస్సైల్ దాడి
-
Mar 14, 2026 10:54 IST
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ దాడుల వెనుక రష్యా హస్తం ఉండొచ్చు
యుద్ధంలో ఇరాన్‌కు పుతిన్ పరోక్షంగా మద్దతిస్తున్నారు
-
Mar 14, 2026 09:48 IST
హైదరాబాద్: నేడు మాజీ డీజీపీ హెచ్‌జే దొర అంత్యక్రియలు
బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో నివాళులర్పిస్తున్న ప్రముఖులు
మరికాసేపట్లో హెచ్‌జే దొర పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి
మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో దొర అంత్యక్రియలు
-
Mar 14, 2026 09:46 IST
ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఫాస్టాగ్ ఇయర్ పాస్ ధరలు
2.5 శాతం మేర పెరిగి రూ.3,075కు చేరనున్న ఇయర్ పాస్ రేటు
హైవే టోల్ ధరల వార్షిక సవరణలో భాగంగా పెంచుతున్నట్లు NHAI అధికారుల స్పష్టం
మార్చి 31 లోగా రీఛార్జ్ చేసుకునేవారికి పాత ధరలే వర్తింపు
-
Mar 14, 2026 09:35 IST
శ్రీసత్యసాయి జిల్లాలో తన్నుకున్న వైసీపీ కార్యకర్తలు
ఆర్టీసీ బస్‌స్టాండ్‌లోనే ఒకరిపై ఒకరు దాడి
మేళవాయి ఎంపీటీసీ నాగరత్నమ్మ భర్త, హరేసముద్రం వైసీపీ నేత మధ్య ఘర్షణ
బహిరంగంగా వైసీపీ నేతలు కొట్టుకోవడంపై తీవ్ర విమర్శలు
-
Mar 14, 2026 09:18 IST
నేడు పాడేరులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
జనసేన జెండాను ఆవిష్కరించనున్న పవన్ కల్యాణ్
నందిగరువు గ్రామంలో గిరిజనులతో పవన్ మాటామంతీ
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న పవన్ కల్యాణ్
-
Mar 14, 2026 09:15 IST
ఇరాన్ ఆర్థిక కిరీటం ఖర్గ్ ఐలాండ్‌పై విరుచుకుపడిన అమెరికా సైన్యం
ఐలాండ్‌లోని సైనిక లక్ష్యాలను తునాతునకలు చేశామని ప్రకటించిన ట్రంప్
హోర్ముజ్ జలసంధి వద్ద నౌకలను రవాణాను అడ్డుకుంటే మరింత తీవ్ర దాడులు
యూఎస్ బలగాల దాడి వీడియోను షేర్ చేసిన ట్రంప్
ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90 శాతం ఖర్గ్ ఐలాండ్ నుంచే సరఫరా
-
Mar 14, 2026 08:42 IST
బాపట్ల: పర్చూరు మండలం దేవరపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
గొర్రెల మందను ఢీకొట్టి కారు బోల్తా
43 గొర్రెలు మృతి
కారును వదిలేసి డ్రైవర్ సహా అందరు పరారీ
-
Mar 14, 2026 08:31 IST
కేసీఆర్ హయాంలో మూసీ అభివృద్ధిపై నేడు బీఆర్ఎస్ ప్రెజెంటేషన్
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో పాల్గొననున్న కేటీఆర్
-
Mar 14, 2026 08:30 IST
కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి: కేంద్రమంత్రి బండి సంజయ్
తుంగతుర్తి ఎమ్మెల్యే మళ్లీ ఎలా గెలుస్తారో చూస్తాం
హిందూధర్మాన్ని కించపరిచేలా తుంగతుర్తి ఎమ్మెల్యే మాట్లాడారు
మత విద్వేషాలు రగిల్చేలా తుంగతుర్తి ఎమ్మెల్యే మాట్లాడారు
-
Mar 14, 2026 08:29 IST
కరీంనగర్: కొండగట్టు అభివృద్ధి బాధ్యత మేం తీసుకుంటాం: బండి సంజయ్
పవన్ కొండగట్టుకు టీటీడీ నుంచి నిధులు కేటాయించారు
BRS, కాంగ్రెస్ ప్రభుత్వాలు కొండగట్టు అభివృద్ధిని పట్టించుకోలేదు
కొండగట్టు పాదయాత్రకు రాజకీయాలతో సంబంధం లేదు
-
Mar 14, 2026 08:28 IST
ఇరాన్ భూభాగంపై దాడులకు సిద్ధమైన అమెరికా
ఇరాన్‌పై పట్టు సాధించేందుకు అమెరికా వ్యూహం
మిడిల్ ఈస్ట్‌కు అమెరికా మెరైన్ కమెండోలు
సముద్రమార్గంలో మెరైన్ దళాల తరలింపు
-
Mar 14, 2026 08:27 IST
కృష్ణా: గూడూరు పీఎస్ దగ్గర పేర్ని నాని హంగామా
పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పేర్ని నాని
2 రోజులుగా మచిలీపట్నంలో జనసేన జెండా దిమ్మ వివాదం
వైసీపీ నాయకుడు బొర్రా విఠల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
విఠల్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చినా పీఎస్ దగ్గర పేర్నినాని హంగామా
-
Mar 14, 2026 07:55 IST
నేటి నుంచి ఇండిగో విమాన టికెట్ ధరలు పెంపు
విమాన టికెట్లపై ఇంధన సర్‌చార్జ్ పెంచిన ఇండిగో
కనిష్ఠంగా రూ.425, గరిష్ఠంగా రూ.2,300 పెంచిన ఇండిగో
-
Mar 14, 2026 07:54 IST
తెలంగాణలో వాయుకాలుష్యం తగ్గించేలా ప్రణాళికలు
1.26 లక్షల ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు
పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో నడుస్తున్న ఆటోలకు...
ఎలక్ట్రిక్ కిట్లు అమర్చే ప్రత్యేక పాలసీపై కసరత్తు
-
Mar 14, 2026 07:10 IST
14వ రోజుకు చేరిన ఇరాన్ యుద్ధం
టెహ్రాన్ నుంచి టెల్‌అవీవ్ వరకు విధ్వంసకర గుర్తులు
ఇరాన్, లెబనాన్‌లో అనేక లక్ష్యాలు ఛేదించిన ఇజ్రాయెల్ దళాలు
హోర్ముజ్‌తో పాటు ఇతర స్థావరాలకు అదనపు బలగాలను దించిన అమెరికా
జపాన్ నుంచి నౌకలు, 2,500 మంది కమాండోలు వెళ్లాలని అమెరికా ఆదేశం
మొజ్తాబా ఖమేనీ, లారిజానీ అచూకీ చెబితే రూ.93 కోట్లు ఇస్తామన్న అమెరికా
-
Mar 14, 2026 07:09 IST
నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం
ఏపీవ్యాప్తంగా జనసేన శ్రేణుల వేడుకలు
-
Mar 14, 2026 07:04 IST
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
ఇవాళ బంగారం, వెండి ధరలు వివరాలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,680
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,290
హైదరాబాద్‌లో కిలో వెండి ధర దాదాపు రూ.2.89 లక్షలుగా ఉంది
-
Mar 14, 2026 06:59 IST
హైదరాబాద్: టోలీచౌకిలో అగ్నిప్రమాదం
సెవెన్ టూంబ్స్ సబ్‌స్టేషన్ పక్కన చెలరేగిన మంటలు
ప్రమాద సమయంలో సమీప మసీద్‌లో 2 వేల మంది
మసీద్‌లో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు
మహిళలు, చిన్నారులను సురక్షితంగా పంపిన మసీద్ కమిటీ
-
Mar 14, 2026 06:53 IST
తెలంగాణలో నేటి నుంచి పదోతరగతి పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం
ఏప్రిల్ 16వ తేదీతో పూర్తికానున్న టెన్త్ పరీక్షలు