Share News

రూ.60 వేల పెట్టుబడితో నెలకు రూ.14 లక్షల ఆదాయం

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:13 PM

మూడున్నర దశాబ్దాల క్రితం ఒక వ్యక్తి పెట్టిన రూ.60 వేల పెట్టుబడి అతడిని కోటీశ్వరుడిని చేసింది. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

రూ.60 వేల పెట్టుబడితో నెలకు రూ.14 లక్షల ఆదాయం
viral property investment post

ఇంటర్నెట్ డెస్క్: రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో భవిష్యత్తుకు భద్రత అన్న నమ్మకం జనాల్లో ఉంది. పెద్దలందరూ తమ పిల్లలకు ఇదే విషయం చెబుతుంటారు. చిన్న జాగా అయినా కొనుక్కుని భవిష్యత్తుకు భద్రత కల్పించుకోమని పదే పదే చెబుతుంటారు. ఈ నేపథ్యంలో తన బంధువు ఒకరు సుమారు 36 ఏళ్ల క్రితం పెట్టిన పెట్టుబడి ప్రస్తుతం ఎంతటి ఆదాయాన్ని ఇస్తోందో చెబుతూ ఒక వ్యక్తి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.

స్వప్నిల్ కొమావర్ అనే స్టాక్ మార్కెట్ ట్రేడర్ ఈ పోస్టు పెట్టారు. తనకు మేనమామ వరుసయ్యే ఒక బంధువు 1990లో రూ.60 వేలు పెట్టి తన సొంత ఊరిలోనే నాలుగు ఎకరాల స్థలం కొన్నారని చెప్పారు. కాలక్రమంలో ఆ ప్రాంతం కొత్త జిల్లా పరిధిలోకి రావడంతో జాగా రేట్లు అమాంతం పెరిగిపోయాయని చెప్పారు. ఆయన టౌన్ కూడా బాగా అభివృద్ధి చెందిందని అన్నారు. చివరకు ఒక కార్పొరేట్ సంస్థ తన మామ వద్ద నుంచి రెండు ఎకరాలను రూ.25 కోట్లకు కొనుగోలు చేయడంతో ఆయనపై కనకవర్షం కురిసిందని చెప్పారు. నాడు కొన్న స్థలంలో ఇంకా రెండు ఎకరాలు ఇప్పటికీ ఆయన వద్ద ఉందని తెలిపారు. రూ.25 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్లలోకి మళ్లించడంతో ప్రస్తుతం నెలకు రూ.14 లక్షల ఆదాయం వస్తోందని అన్నారు.


ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పెద్దాయన తీసుకున్న నిర్ణయాలకు కాలం కూడా కలిసి వచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అంతకాలం పాటు భూమిని జాగ్రత్తగా కాపాడుకోవడం సామాన్యమైన విషయం కాదని కొందరు కామెంట్ చేశారు. ఇంత డబ్బు వచ్చినందుకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎంత కట్టారని మరికొందరు ప్రశ్నించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఈ వార్తలో చదవండి:

టిక్కెట్ ఉన్నా రైల్లో సీటు దొరక్క కొరియన్ వ్యక్తి ఇక్కట్లపాలు! చివరకు..

విమానంలో దుబాయ్‌కి వెళ్లిన మహిళ.. ఇంత రిస్క్ ఎందుకో తెలిస్తే..

Updated Date - Mar 14 , 2026 | 05:32 PM