విమానంలో దుబాయ్‌కి వెళ్లిన మహిళ.. ఇంత రిస్క్ ఎందుకో తెలిస్తే..
ABN , Publish Date - Mar 13 , 2026 | 06:14 PM
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉద్యోగం కోసం దుబాయ్‌కు వెళ్లిన ఒక మహిళ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. విమానంలో తాను తప్ప మరే ప్యాసింజర్ లేరంటూ ఆమె ఈ వీడియోను షేర్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు అక్కడి వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విదేశీయులు అనేక మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గల్ఫ్‌ను వీడుతున్నారు. ఇవేవీ లెక్క చేయని ఒక మహిళ దుబాయ్‌కు విమానంలో బయలుదేరింది. ఆ విమానంలో ఉన్న ఒకే ఒక ప్యాసింజర్ ఆమె కావడంతో ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇంత రిస్క్ చేసి తాను దుబాయ్‌కు ఎందుకు వెళ్లిందీ కూడా ఆమె చెప్పుకొచ్చింది.
లాట్వియా దేశానికి చెందిన మారీనా గిల్లా అనే మహిళ ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో దుబాయ్‌కు వెెళ్లింది. ‘రీగా నుంచి దుబాయ్‌కు విమానంలో వెళ్లా. అది చాలా వింత జర్నీ! విమానంలో నేను తప్ప మరే ప్యాసింజర్ లేరు. వాస్తవానికి వాళ్లు ఫ్లైట్‌ను క్యాన్సిల్ చేస్తారని అనుకున్నా. కానీ అలా జరగనందుకు ఆశ్చర్యం వేసింది. నాకు యూఏఈలో మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. అందుకే కాస్త రిస్క్ అయినా వెళ్లాను’
‘ఆ ఫ్లైట్‌లో ఐదురుగు ఫ్లైట్ అటెండెంట్లు మాత్రమే ఉన్నారు. వారంతా విమానంలో ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. నచ్చిన ఫుడ్ తిన్నారు. చక్కగా ఉల్లాసంగా గడిపారు. నేను అలాగే ఎంజాయ్ చేశా. వాస్తవానికి విమానం ఆరు గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఈ క్రమంలో పైలట్ వచ్చి నాకు సారీ కూడా చెప్పారు’ అని మహిళ పేర్కొంది. ఇక ఈ వీడియో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొందరు ఆమెను ప్రశంసిస్తే మరికొందరు ఆమె తెగువకు ఆశ్చర్యపోయారు.
ఈ వార్తలూ రాయండి:
చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం! ఫోన్ చూస్తుండగా..
ఒకే బోగీలో 30 మంది.. ఈ ఫ్యామిలీ రచ్చ చూస్తే..