Share News

సర్‌ఛార్జి బాదుడు.. ఆకాశ ఎయిర్ టికెట్ ధరలకు రెక్కలు

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:17 PM

విమాన ఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానాయాన సంస్థలు ఒక్కొక్కటిగా ఆ భారాన్ని ప్రయాణికులపై మోపుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో సంస్థలు టికెట్ ధరపై ఇంధన సర్‌ఛార్జి విధించాయి. తాజాగా ఆకాశ ఎయిర్ సైతం టిక్కెట్ల ధరలను పెంచుతున్నట్టు శనివారం నాడు ప్రకటించింది.

సర్‌ఛార్జి బాదుడు.. ఆకాశ ఎయిర్ టికెట్ ధరలకు రెక్కలు
Akasa Air

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం విమానయాన రంగంపై ప్రభావం చూపుతోంది. విమాన ఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానయాన సంస్థలు ఒక్కొక్కటిగా ఆ భారాన్ని ప్రయాణికులపై మోపుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో సంస్థలు టికెట్ ధరపై ఇంధన సర్‌ఛార్జ్ విధించాయి. తాజాగా ఆకాశ ఎయిర్ (Akasa Air) సైతం టికెట్ల ధరలను పెంచుతున్నట్టు శనివారం నాడు ప్రకటించింది. దేశవాళీ, అంతర్జాతీయ రూట్లలో రూ.199నుంచి రూ.1,300వరకూ సర్‌ఛార్జీలను విధిస్తున్నట్టు తెలిపింది. మార్చి 15వ తేదీ నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపింది.


'మార్చి 15వ తేదీ అర్ధరాత్రి 12.01 గంటలకు ముందు బుకింగ్ చేసుకున్న వారికి ఇది వర్తించదు. సెక్టార్, విమాన ప్రయాణ సమయాన్ని బట్టి ఫ్యూయెల్ సర్‌ఛార్జి ఉంటుంది' అని ఆకాశ్ ఎయిర్ తెలిపింది. పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఫ్యూయెల్ సర్‌ఛార్జీలను సమీక్షిస్తామని పేర్కొంది.


ఇండియన్ ఏవియేషన్ మార్కెట్‌ షేర్‌ సుమారు 5 శాతం ఉన్న ఆకాశ్ ఎయిర్ సుమారు రెండు డజన్ల దేశీయ గమ్యస్థానాలు, కువైట్, దోహా, జెడ్డా, రియాద్, అబుదాబి సహా మధ్య ప్రాచ్యం/పశ్చిమాసియా అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను నడుపుతోంది.


ఇవి కూడా చదవండి..

యుద్ధం ఎఫెక్ట్‌పై భయాందోళనలు సృష్టిస్తున్న కాంగ్రెస్... అస్సాంలో ప్రధానమంత్రి మోదీ

హోర్ముజ్ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు.. ఫలించిన భారత్ దౌత్యం

Updated Date - Mar 14 , 2026 | 05:40 PM