Share News

టాంజానియాకు టెక్నాలజీ సహకారం.. ముందుకొచ్చిన తెలంగాణ

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:13 PM

టాంజానియా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఐటీ, టూరిజం, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

టాంజానియాకు టెక్నాలజీ సహకారం.. ముందుకొచ్చిన తెలంగాణ
Telangana Tanzania partnership

హైదరాబాద్, మార్చి 14: టాంజానియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెలంగాణ సర్కార్(Telangana Govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిజిటల్ ఎకానమీగా మారాలన్న టాంజానియా లక్ష్యానికి సాంకేతిక సహకారం అందించడానికి తెలంగాణ ముందుకు వచ్చింది. టాంజానియా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఐటీ, టూరిజం, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ గవర్నెన్స్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఎకోసిస్టం అభివృద్ధిపై సహకారం పెంచాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.


టాంజానియాలో ఫార్మా డిస్ట్రిబ్యూషన్ హబ్ ఏర్పాటు చేసే అవకాశాలపై అధ్యయనం చేయనున్నారు. తెలంగాణ ‘మీ సేవ’ మోడల్ ద్వారా పౌర సేవల డెలివరీ విధానంపై మార్గదర్శకత్వం అందించాలని సమావేశంలో నిర్ణయించారు. ‘వీ హబ్’ (WE Hub) ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పించే అంశంపై చర్చించారు. స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్, అప్ - స్కిల్లింగ్ రంగాల్లో కూడా సహకారం అందించాలని సమావేశంలో నిర్ణయించారు. ‘త్వరలో తెలంగాణతో ఎంవోయూ కుదుర్చుకుంటాం. ఈ భాగస్వామ్యం రెండు దేశాల మధ్య సాంకేతిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది’ అని టాంజానియా మంత్రి ప్రకటించారు.


ఇవి కూడా చదవండి...

విద్యాశాఖ నిర్లక్ష్యం.. 80 మంది విద్యార్థులకు అదే స్కూల్‌లో ఎగ్జామ్ సెంటర్

బండి సంజయ్ పాదయాత్రలో తేనెటీగల దాడి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 14 , 2026 | 05:30 PM