పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ.. ఎమోషనల్ పోస్ట్..
ABN , Publish Date - Mar 14 , 2026 | 03:02 PM
ప్రముఖ నటి షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ రెండోసారి తల్లి అయ్యింది. ఈ విషయాన్ని నటి పూర్ణ, ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటి షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ రెండోసారి తల్లి అయ్యింది. ఈ విషయాన్ని నటి పూర్ణ(Actress Poorna), ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. ‘భగవంతుడు ఆశీస్సులతో ఈరోజు(శనివారం) ఉదయం 4 గంటల 25 నిమిషాలకు మాకు ఆడబిడ్డ(baby girl) పుట్టింది. తాను మా జీవితాల్లోకి వచ్చిన దేవత. డెలివరీ సాఫీగా జరిగినందుకు ఆ దేవుడికి, నన్ను ఎల్లవేళలా పర్యవేక్షించిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని పూర్ణ పేర్కొన్నారు. తన కొడుకు హమ్దాన్‌కు తోడుగా ఇప్పుడు బుజ్జి చెల్లి వచ్చిందని ఆమె అన్నారు. ఈ పోస్టు చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మలయాళ నటి అయిన పూర్ణ ‘సీమటపాకాయ్’,‘అవును’ చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా నటించిన పూర్ణ ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తోంది. పలు టీవీ షోల్లో జడ్జీగా వ్యవహరిస్తున్నారు. కాగా, పూర్ణ 2022 లో వ్యాపారవేత్త అయిన షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 2023లో బాబు పుట్టాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: మంత్రి ఉత్తమ్
గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రమే కారణం.. మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజం
టూరిస్ట్ బస్సు బోల్తా.. నలుగురి మృతి
Read Latest Telangana News And AP News And International News And Telugu News