Share News

బండి సంజయ్ పాదయాత్రలో తేనెటీగల దాడి

ABN , Publish Date - Mar 14 , 2026 | 03:12 PM

కేంద్రమంత్రి బండి సంజయ్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద పాదయాత్రలో కలకలం రేగింది. కార్యకర్తలు డ్రోన్ కెమెరాను ఎగురవేయగా.. చెట్టుకు ఉన్న తేనెతుట్టెకు డ్రోన్ తగిలింది.

బండి సంజయ్ పాదయాత్రలో తేనెటీగల దాడి
Bandi Sanjay

కరీంనగర్, మార్చి 14: కేంద్ర మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay) చేపట్టిన 'అంజన్న ఆశీర్వాద' పాదయాత్రలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. రామడుగు మండలం కోనరావుపేట ప్రాంతంలో యాత్ర సాగుతుండగా డ్రోన్‌ కెమెరా ద్వారా ఫుటేజ్‌ తీసేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈక్రమంలో చెట్టుకు ఉన్న తేనెతుట్టెకు డ్రోన్‌ తగిలింది. దీంతో ఒక్కసారిగా తేనెటీగలు పైకి లేచి దాడి చేశాయి. వెంటనే బండి సంజయ్‌, ఆయన సిబ్బంది అప్రమత్తమయ్యారు. తేనెటీగల దాడితో యాత్రలో పాల్గొన్న కార్యకర్తలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


తేనెటీగల దాడిలో నలుగురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో పాదయాత్రకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. అనంతరం తిరిగి మొదలైంది. బండి సంజయ్‌ చేపట్టిన ‘అంజన్న ఆశీర్వాద’ యాత్ర కరీంనగర్ నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వరకు సాగనుంది. మొత్తం 40 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. ఈరోజు సాయంత్రానికి కొండగట్టుకు బండి సంజయ్ పాదయాత్రగా చేరుకోనున్నారు.


ఇవి కూడా చదవండి...

కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే

విద్యాశాఖ నిర్లక్ష్యం.. 80 మంది విద్యార్థులకు అదే స్కూల్‌లో ఎగ్జామ్ సెంటర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 14 , 2026 | 04:22 PM