గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:21 AM
అమరావతిలోని ఆయా గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
అమరావతి , మార్చి 14 (ఆంధ్రజ్యోతి): అమరావతిలోని ఆయా గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఏపీ మంత్రి నారాయణ (Minister Narayana) వ్యాఖ్యానించారు. ఈ పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో అండర్ గ్రౌండ్ వాటర్, స్టామ్ వాటర్, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు వేస్తామని తెలిపారు. ఈరోజు(శనివారం) అమరావతిలోని అనంతవరం, నెక్కలు గ్రామసభల్లో మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు.
గ్రామసభల నిర్వహణపై దృష్టి..
ఈ సందర్భంగా మంత్రి నారాయణ ప్రసంగించారు. మౌలిక సదుపాయాల కల్పనపై, గ్రామసభల నిర్వహణపై దృష్టిపెట్టామని చెప్పుకొచ్చారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలోని పనుల్లో ప్రస్తుతం 30 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. 2027 జూన్ నాటికి రాజధానిలో 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు,1500 కిలోమీటర్ల లేట్ అవుట్ రోడ్లు పూర్తి అవుతాయని వెల్లడించారు. 2028 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవనాలు పూర్తి అవుతాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రకృతి సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.. ఆ రైతుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
విద్యార్థులకు నాణ్యతలేని భోజనం.. మంత్రి లోకేశ్ ఆగ్రహం
ఉద్దానం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం చారిత్రాత్మక పరిష్కారం.. తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స
Read Latest AP News And Telangana News And International News And Telugu News